వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన
ABN , First Publish Date - 2021-07-24T07:01:47+05:30 IST
జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో, కాలినడకన, ద్విచక్రవాహనంపై తిరు గుతూ పంట పొలాలు, చెరువులను పరిశీలించారు.

తెగిన నాళ్లచెరువు, మోతె పెద్దచెరువు, మాటుకాలువ, చెక్‌డ్యాంలను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
కాలినడకన, మోటార్ సైకిల్‌పై వెళ్లి నష్టంపై వాకబు
నాళ్లచెరువు కట్టకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశం
వేల్పూర్ / భీమ్‌గల్ రూరల్, జూలై 23 : జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని శుక్రవా రం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో, కాలినడకన, ద్విచక్రవాహనంపై తిరు గుతూ పంట పొలాలు, చెరువులను పరిశీలించారు. భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలోని నాళ్ల చెరువుకట్ట తెగిపోగా శుక్రవారం మంత్రి చెరువును పరిశీలించారు. వె ంటనే మరమ్మతులు చేపట్టి ఆయకట్టు కింద నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పరిహారం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. కట్ట మరమ్మతుల కోసం రూ.94 లక్షలు కేటాయించామని తెలిపారు. ఇదే సమయ ంలో న్యావనంది, ముచ్కూర్ గ్రామాల మధ్య నెలకొన్న భూవివాదాన్ని ముచ్కూర్ గ్రామస్ధులు మంత్రి దృష్టికి తీ సుకెళ్లగా సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ రాజేందర్‌కు సూచించారు. ఆ తర్వాత భీమ్‌గల్ మున్సిపల్ పరి ధిలోని ప్రధాన రహదారి వెడల్పు పనులను మంత్రి ప్రశా ంత్‌రెడ్డి పరిశీలించారు. అదే విధంగా భీమ్‌గల్ కప్పలవా గు చెక్‌డ్యాం పూర్తిగా నిండడంతో మంత్రి పరిశీలించారు. చెక్‌డ్యాం పరిసరాల్లో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండా లని, మరో రెండు, మూడు రోజులు వర్ష సూచన ఉండడ ంతో వాగుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తా నుంచి పెట్రోల్ పంప్ వ రకు ప్రధానరోడ్డు కొంత దిగువన ఉండడం వల్ల నీరు ని లుస్తుండడాన్ని చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, కమిషన ర్ గోపు గంగాధర్ మంత్రి దృష్టికి తీసుకురావడంతో అట్టి రోడ్డును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్అండ్ బీ అధికారులు మున్సిపల్ అధికారులు అధికారుల సమన్వ యంతో దిగువన ఉన్న రోడ్డుపైకి వరదనీరు రాకుండా చర్య లు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మండలం లోని పాతబస్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డు వెడ ల్పు కోసం ఇటీవల కోకాలను వెనక్కి జరపడాన్ని చూసిన మంత్రి రోడ్డు వెడల్పుకు ఆటంకం కలగకుండా ప్రహరీని ఆ నుకొని పది ఫీట్ల వరకు కోకాలను వెనక్కి తీసుకోవాలని మంత్రి సూచించారు.
మోతె పెద్ద చెరువు పరిశీలన
వేల్పూర్ మండలంలోని మోతె గ్రామ పెద్దచెరువుకు నీ రందించే మాటుకాలువ మోతె గ్రామం కప్పలవాగుపై ఉన్న మినీ వంతెన లెవల్, అక్లూర్ వాగులో నిర్మించిన చెక్‌డ్యాంల ను మంత్రి పరిశీలించారు. అక్లూర్ చెక్‌డ్యాం నాణ్యతలో ప లు జాగ్రత్తలు చేపట్టాలని, మరమ్మతులు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. మోతె గ్రామంలో పెద్దచెరువు 30ఏళ్ల తర్వాత నిండి అలుగు పారాడాన్ని మంత్రి పరిశీలించారు. మోతె గ్రామంలో తాగునీటి సమస్య గతంలో ఉండేదని, సీ ఎం కేసీఆర్ సహయనిధి నుంచి మాటుకాలువకు రూ.3కోట్ల 80లక్షలు మంజూరు చేసి పనులు పూర్తి చేయించామన్నా రు. మాలుకాలువ ద్వారా గత సంవత్సరం కొంత ఫలితం వ చ్చిందని, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి జూలై నెలలో నే మాటుకాలువ ద్వారా చెరువు నిండడం, అలుగు పారా డం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా పెద్దచెరువు అలుగు వద్ద మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పూజలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి అక్కున చేర్చుకొని అన్నం పెట్టిన గడ్డ మోతె గ్రామమన్నారు. గతంలో తాగునీటి గోస పడ్డ మోతె నేడు జలకళతో మురిసిపోతోందన్నారు. ఇక్కడి రైతుల ముఖాల్లో ఆనందం నింపిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ముచ్కూర్ స ర్పంచ్ బండిజ్యోతి, ఉప సర్పంచ్ ఒజ్జం భూమేష్,వార్ట్ మెం బర్ ఓరుగంటి గంగాధర్,మాజీ సర్పంచ్ దువ్వాల సుదర్శన్, వేల్పూర్ ఎంపీపీ బీమ జమున రాజేందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు రజిత చంద్రమోహన్‌గౌడ్, జైడి చిన్నవ్వ నాగాధర్‌రెడ్డి, ఎంపీటీసీ డొల్ల సత్తెవ్వ రాజేశ్వర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేశ్వర్, ఏఎంసీ బాల్‌రాజ్, ఉపసర్పంచ్ కల్లెం రాజే ష్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జైడి నాగాధర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.