మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి

ABN , First Publish Date - 2021-10-30T05:00:40+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’ జిల్లా ఎడిషన్‌లో బుధ వారం ప్రచురితమైన ‘చారుతోనే సరి’ అనే కథనానికి స్పందించిన ఉమ్మడి జిల్లాల గురుకుల పాఠశాల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ ఆర్‌సీవో మేరీ యేసుపాదం శుక్రవారం బాన్సువాడ మండలం బోర్లం గురు కుల పాఠశాలను తనిఖీ చేశారు.

మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలి
బోర్లం గురుకులంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఆర్‌సీవో

బాన్సువాడ, అక్టోబరు 29: ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా ఎడిషన్‌లో బుధ వారం ప్రచురితమైన ‘చారుతోనే సరి’ అనే కథనానికి స్పందించిన ఉమ్మడి జిల్లాల గురుకుల పాఠశాల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ ఆర్‌సీవో మేరీ యేసుపాదం శుక్రవారం బాన్సువాడ మండలం బోర్లం గురు కుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంట చేసే సామగ్రి గదితో పాటు కూరగాయలు, పప్పులను పరిశీ లించారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించారు. పాఠశా లలో విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వండి పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులకు కొవిడ్‌ నిబంధనలతో పాటు పాఠశాల ఆవరణ శుభ్రం గా ఉంచాలని, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపా లని పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ ఫలి తాలు వచ్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యా యులపై ఉందన్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. అనంతరం బాన్సువాడ మండలం కొయ్యగుట్ట గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణతో పా టు విద్యార్థుల తరగతి గదులు, వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు శోభారాణి, ఇర్ఫానా భాను, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.

విద్యార్థుల పట్ల వార్డెన్లు జాగ్రత్తలు తీసుకోవాలి
విద్యార్థుల పట్ల వార్డెన్లు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సాంఘి క సంక్షేమ అధికారిణి రజిత అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో జిల్లా ఎస్సీ వసతి గృహాల వార్డెన్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సూచించి న కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అదేవిధంగా బయోమెట్రిక్‌ ద్వారా హాజరు శాతం తో పాటు ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. విద్యార్థుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ సాంఘిక సంక్షేమ అధికారి లియో, కామారెడ్డి అధికారిణి విజయలక్ష్మీ, హెచ్‌ డబ్ల్యూవో రాములు, ఎంపీటీసీ శ్రావణి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, జిల్లాలోని హెచ్‌డబ్ల్యూవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:00:40+05:30 IST