ఎరువు.. దరువు!

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

రైతుల ఎత్తిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పిడుగు పడింది. ఎన్నికలు ముగియడంతో కేం ద్ర ప్రభుత్వం తిరిగి మళ్లీ కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెంపు డ్రామాను తెరపైకి తేవడంతో రైతుల్లో గందరగోళం ఏర్పడిం ది. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కాంప్లెక్స్‌ ఎరువుల కొను గోళ్లకు రైతులు ఎగబడుతున్నారు.

ఎరువు.. దరువు!

భారీగా పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు

ధరల పెరుగుదలతో అప్రమత్తమైన రైతులు 

ప్రస్తుతం పాత ధరలకే ఎరువుల కొనుగోళ్లు

ఒక్క రోజులో లక్షల రూపాయల ఎరువుల విక్రయం

బోధన్‌, మే 5: రైతుల ఎత్తిన కాంప్లెక్స్‌ ఎరు వుల ధరల పిడుగు పడింది. ఎన్నికలు ముగియడంతో కేం ద్ర ప్రభుత్వం తిరిగి మళ్లీ కాంప్లెక్స్‌ ఎరువుల ధరల పెంపు డ్రామాను తెరపైకి తేవడంతో రైతుల్లో గందరగోళం ఏర్పడిం ది. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కాంప్లెక్స్‌ ఎరువుల కొను గోళ్లకు రైతులు ఎగబడుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధర లు భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం దీని పై ఫర్టిలైజర్‌ మార్కెటింగ్‌ డివిజన్‌ అన్ని రాష్ర్టాలకు స్పష్ట మైన సమాచారం ఇవ్వడంతో ఇక ఎరువుల ధరల పెంపు ఖరారయింది. ఒక్కో బస్తాకు కాంప్లెక్స్‌ ఎరువుల ధర రూ. 370 నుంచి రూ.700 వరకు పెరిగింది. ముడిసరుకుల ధర ల్లో పెరుగుదల కారణంగా ఎరువుల ధరలు పెంచుతున్నా మని కేంద్రం పేర్కొనడం రైతుల నడ్డి విరిచినట్లు అయింది. గతంలో డీఏపీ బస్తా ధర రూ.1,200లు ఉండగా కేంద్రం పెంచిన కొత్త ధర ప్రకారం ఒక్కో డీఏపీ బస్తా రూ.1,900 లకు మార్కెట్‌లో లభించనుంది. అంటే ఒక్కో డీఏపీ బస్తా పైన రూ.700 వరకు ధర పెరిగింది. ఈ లెక్కన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలన్నీ పెరిగిపోయాయి. ఎరువుల ధరలు పెరు గుదల రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఎరువుల ధరల పెరుగుదల చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర భారంగా మారనుంది. రైతులు వ్యవసాయం అంటేనే భయపడే పరి స్థితులు ఏర్పడ్డాయి. ఎరువుల ధరల పెరుగుదలతో రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుగా మా రనుంది. ఓ వైపు ఇప్పటికే మార్కెట్‌లో ధాన్యానికి ధర లేక దిగుబడులు లేక రైతుల నడ్డి విరిగి అప్పుల ఊబిలో కూరు కుపోగా మరోవైపు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చం దంగా రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

ముందస్తు కొనుగోళ్లకు రైతుల మొగ్గు

ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ముగిసి, ఫలితాలు రాగానే కేం ద్ర ప్రభుత్వం రైతుల నెత్తిన ఎరువుల ధరాభారం మోపిం ది. ఎన్నికలకు మునుపు ఒకసారి ధరను పెంచినట్టుగానే పెంచి తగ్గించింది. కంటితుడుపుగా ఎన్నికల సమయంలో వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగియగానే అసలు రంగును బహిర్గతం చేసింది. కాంప్లెక్స్‌ ఎరువుల ధ రలను పెంచుతూ మళ్లీ తమ అసలు రంగును బయట పె ట్టింది. ఎరువుల ధరలు పెరగడంతో రైతులు కాంప్లెక్స్‌ ఎరు వుల కోసం ఎగబడుతున్నారు. ప్రతియేటా రైతులు జూన్‌, జూలై మాసాల్లో వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో ఎరువుల ను కొనుగోలు చేస్తారు. కానీ, ఈ ఏడాది కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో రైతులు ముందే అ ప్రమత్తం అయ్యారు. ఎరువుల కోసం సహకార సొసైటీలు గ్రోమోర్‌లు, ఇతర ప్రైవేటు డీలర్‌ల వద్ద పడిగాపులు కాస్తు న్నారు. పాత ధరలకే ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు కేంద్రం ఇలా పెంచగానే రైతులు అలా అప్రమత్తమయ్యారు. ఒక్కో రైతు లక్షలాది రూపాయ ల ఎరువులను కొనుగోలు చేసేశారు. జిల్లాలో బుఽధవారం ఒక్కరోజే ఒక్కో సొసైటీలో, గ్రోమోర్‌లు, ప్రైవేటు డీలర్‌ల వ ద్ద లక్షలాది రూపాయల కాంప్లెక్స్‌ ఎరువుల అమ్ముడుపో యాయి. పాత ధరలకే కాంప్లెక్స్‌ ఎరువులు నిల్వలు ఉండడ ంతో రైతులు జాగ్రత్త పడి ఎరువులను కొనుగోలు చేసుకు న్నారు. చిన్న సన్నకారు రైతులు మాత్రం దిక్కుతోచని పరిస్థి తిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధా న్యాన్ని ఇచ్చి డబ్బులు రాక ఎదురుచూస్తున్న రైతులు పెరిగి న ఎరువుల ధరలతో ఉసూరు మంటున్నారు. అటు డబ్బు లు లేక ఇటు ఎరువుల ధరలు పెరిగి వ్యవసాయం అంటేనే భయాందోళన చెందుతున్నారు. ఒకేసారి కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా ధర 350 రూపాయల నుంచి 700 రూపాయల పైనే పెంచడం ఏమిటని రైతులు మండిపడుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలు చూసి రైతులు విస్తు పోతున్నారు. పెద్ద రై తులు భూస్వాములు పెరిగిన ధరలను చూసి ముందే అప్ర మత్తమై ఎరువులను కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కో రైతు 200 నుంచి 300 బస్తాల వరకు కాంప్లెక్స్‌ ఎరువులను కొనుగోలు చేసుకున్నారు. 

ప్రైవేటు ఎరువుల వ్యాపారుల మాయాజాలం

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు రాత్రికి రాత్రే పెరిగిపోవడం ప్రైవేటు ఎరువుల వ్యాపారులకు కల్పతరువుగా మారింది. ఇప్పటికే గోదాములలో కాంప్లెక్స్‌ ఎరువుల నిల్వలు ఉన్న వ్యాపారులు సంబర పడుతున్నారు. ఒక్కోబస్తా ధర 350 రూపాయల నుంచి 700 రూపాయల వరకు పెరగడం చూ సి ఎరువుల వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు సిద్ధమవుతున్నా రు. తమవద్ద ఉన్న ఎరువుల నిల్వల లెక్కలను తప్పదారి పట్టించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వ్యవసాయ శా ఖ అధికారుల కళ్లుగప్పి ఎరువుల నిల్వలను తారుమారు చే సేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఆన్‌లైన్‌ స్టాక్‌ రిజిష్టర్‌లు ఇతర కుంటి సాకులు చెబుతున్న ప్పటికీ ఎరువుల వ్యాపారులు మాత్రం నిల్వలను పక్కదారి పట్టించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. ఇ ప్పటికే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఎరువుల వ్యాపారు లు కాంప్లెక్స్‌ ఎరువులను గోదాముల నుంచి రాత్రికి రాత్రే పక్కదారి పట్టించే పనిలో నిమగ్నమయ్యారు. సందెట్లో సడే మియాగా ఎరువుల వ్యాపారులు రైతులను నిండా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచి రైతులను ఊపిరి ఆడకుండా  చేస్తుండగా ఎరువుల వ్యాపారులు ఇదే అదునుగా భావించి రైతులను నిలువునా దోచుకునేందుకు సిద్ధ మవుతున్నారు. జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమై ప్రై వేటు ఎరువుల వ్యాపారుల వద్ద స్టాక్‌ల నిల్వలను సేకరించ డంతో పాటు గోదాముల వద్ద ప్రత్యేక పహారాను ఏర్పాటుచే స్తే గానీ ఎరువులు పక్కదారి పట్టకుండా ఉంటాయి. 

కాంప్లెక్స్‌ ఎరువులు పాత ధరకే అమ్మాలి

శ్రీనివాస్‌రావు, వ్యవసాయశాఖ అధికారి, కోటగిరి

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరిగినా ఎరువుల వ్యాపారు లు మాత్రం పాత ధరలకే అమ్మాలని కోటగిరి వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. పాత ధరల్లో కొనుగోలు చేసిన కాంప్లెక్స్‌ నిల్వలు ఉన్నాయని, వాటిని పా త ధరలకు విక్రయించాలని, కొత్త ధరల ప్రకారం ఎరువులు వస్తే వాటిని పెంచిన ధరల ప్రకారం అమ్మాలన్నారు. ఎక్క డైనా ఎరువుల వ్యాపారులు పాతకాంప్లెక్స్‌ ఎరువులను కొత్త ధరలకు అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎరువుల ను పక్కదారి పట్టించినా, నిల్వల ప్రకారం గోదాముల్లో లేక పోయినా డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST