రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మనుబోతు
ABN , First Publish Date - 2021-02-03T05:17:54+05:30 IST
మండలంలోని చంద్రాయిన్‌పల్లి గ్రామ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై నీటి కోసం వచ్చిన మనుబోతు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగాయి.
ఇందల్‌వాయి, ఫిబ్రవరి 2: మండలంలోని చంద్రాయిన్‌పల్లి గ్రామ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై నీటి కోసం వచ్చిన మనుబోతు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మనుబోతును పరిశీలించారు. మనుబోతును వాహనంలో ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు తెలిపారు.