నిర్వహణ లోపం.. తాగు నీటికి శాపం
ABN , First Publish Date - 2021-05-05T05:35:26+05:30 IST
ప్రభుత్వం గ్రామాల ప్రజల కు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రతిష్ఠా త్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటింటికీ నళ్లాను బిగించి నీటిని అందజేయాలి.

మిషన్ భగీరథ పైప్‌లైన్ల లీకేజీ.. వృథాగా పోతున్న నీరు
గ్రామాలకు కలుషిత నీరు సరఫరా
చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
నిజాంసాగర్, మే 4: ప్రభుత్వం గ్రామాల ప్రజల కు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రతిష్ఠా త్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటింటికీ నళ్లాను బిగించి నీటిని అందజేయాలి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో స్వచ్ఛమైన నీరు సంగతి అలా ఉంచితే.. కలుషితే నీళ్లే దిక్కవుతున్నాయి. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం గమనార్హం. మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీలు, వాటర్ ట్యాంకుల వద్ద సాగు కాల్వల మాదిరిగా వృథాగా నీరు వెళుతున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. జుక్కల్-సింగీతం మిషన్ భగీరథ పథకం 2016లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 785 హ్యాబిటేషన్లను నీరందించేం దుకు రూ.1300కోట్లు ఖర్చు చే సింది. నిజాంసాగర్ మండలం లోని 39 గ్రామాలకు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మహా దేవన్‌పల్లి శివారులో వెయ్యి లీటర్ల బ్రేక్ ఫ్రెషర్ వాటర్ ట్యాంకును నిర్మాణం చేపట్టి నిజాంసాగర్ మండలంలోని 39 గ్రామాల్లో ఉన్న మంచినీటి ట్యాం కుల్లోకి మిషన్ భగీరథ నీటిని అను సంధానం చేశారు. ఎల్లారెడ్డి బ్రేక్ ఫ్రెషర్ వాటర్ ట్యాంకర్ నుంచి నిజాంసా గర్ మండలంలోని మూడు గ్రామాలకు, బాన్సువాడ బ్రేక్ ఫ్రెషర్ వాటర్ ట్యాంకు నుంచి మరో మూడు గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నా రు. సింగూరు నుంచి వచ్చే ప్రధాన లైన్ పైపుల్లోంచి రంగు నీళ్లు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించ కుండా అలాగే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మహాదేవన్ పల్లి గ్రామ శివారులో నిర్మించిన బ్రేక్ ఫ్రెషర్ వాటర్ ట్యాంకు వద్ద నిత్యం తాగునీరు వృథాగా వెళుతోంది. దీనిని ఓ కన్‌స్ట్రక్షన్ సంస్థ కట్టడి చేయాలి. కానీ అలాంటి చర్యలు ఏమీ చేపట్టడం లేదు. ఎస్‌ఎన్‌ఏ రహదారిని, జాతీయ రహదారి నిర్మాణం పనులు కొనసాగుతుండటంతో మిషన్ భగీరథ పైపులు ధ్వంసం అవుతున్నాయి. ఈ పైప్‌లైన్ల మరమ్మతులు చేస్తున్నప్పటికీ మరమ్మతులు చేస్తున్నప్పుడు బురద నీరు పైప్‌లైన్‌లోకి ప్రవేశించి ఆ నీరంతా గ్రామాల ట్యాంకుల్లోకి వాటర్ ట్యాంకుల్లోకి వెళ్లి గ్రామాల్లోని నీటి కుళాయిల ద్వారా సరఫరా అవుతున్నాయి. 785 హ్యాబిటేషన్లలో ఉన్న వాటర్ ట్యాంకుల్లో వారం రోజు లకు ఒక్కసారి క్లొరినేషన్ చేయాలని మిషన్ భగీరథ అధికారులు గ్రామ పంచాయతీ అధికార యంత్రాం గానికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కారణంగానే గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రంగుమారి వస్తు న్నాయని ప్రజలు చెబుతున్నారు. గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లోకి నీటిని నింపేందుకు అప్పట్లో ఉన్న మంచినీటి ట్యాంకుల్లోకి నీళ్లు నింపడం లేదు. మిషన్ భగీరథ నీటినే వాటర్ ట్యాంకులోకి ఎక్కించి నీటిని వదులుతున్నారు. ఈ పథకం 2018లో ప్రారంభమై 2018 జూన్ వరకు ట్రయల్ రన్ పేరిట నీటిని సరఫరా చేశారు. 2018-19, 2019-20 సంవత్సరంలో సింగూరులో నీటి నిల్వలు లేకపోవడంతో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయలేదు. వర్షాకాలంలో కు రిసిన వర్షాలకు సింగూరు పూర్తిస్థాయిలో నిండింది. మార్చి 2021 నుంచి సింగూరు- జుక్కల్ మిషన్ భగీ రథ పథకం కింద తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రేక్ ఫ్రెషర్ వాటర్ ట్యాంకుల వద్ద నీరు వృథా కాకుండా అరికట్టి మంచి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.