రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-09T05:12:09+05:30 IST

వర్ని మండలం తగిలేపల్లి గ్రామ శివారులోని అంబం కాడిచెరువు కట్టపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్‌ ఆరీఫొద్దీన్‌ (38) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై అనిల్‌ రెడ్డి తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వర్ని, ఫిబ్రవరి 8 : వర్ని మండలం తగిలేపల్లి గ్రామ శివారులోని అంబం కాడిచెరువు కట్టపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్‌ ఆరీఫొద్దీన్‌ (38) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై అనిల్‌ రెడ్డి తెలిపారు. అంబం గ్రామానికి చెందిన ఆరీఫోద్దీన్‌ వర్నిలోని తన సోదరి ఇంట్లో విందు నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చెరువు కట్టపై అదుపుతప్పి పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


Updated Date - 2021-02-09T05:12:09+05:30 IST