పాము కాటుతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-07-24T07:12:18+05:30 IST

మండలంలోని ఆత్మకూర్‌ గ్రామంలో ఒకరు పాముకాటుతో మృతి చెందారు.

పాము కాటుతో వ్యక్తి మృతి


నాగిరెడ్డిపేట, జూలై 24 :
మండలంలోని ఆత్మకూర్‌ గ్రామంలో ఒకరు పాముకాటుతో మృతి చెందారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి (46) కి పాము కాటు వేయడతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య రాజశ్రీ, ఒక కూతురు, ఒక కుమారుడున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జడ్పీటీసీ మనోహర్‌ రెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.   

Updated Date - 2021-07-24T07:12:18+05:30 IST