డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-09-03T05:42:50+05:30 IST

మండలంలోని చిట్టాపూర్‌ 44వ జాతీయరహదారిపై ప్రమాదవశాత్తు డివైడర్‌కు ఢీకొని రాథోడ్‌ ఉమేష్‌(30) అక్కడికక్కడే మృతి చెందినట్టు బాల్కొండ ఎస్సై రాజేందర్‌ తెలిపారు.

డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి


బాల్కొండ, సెప్టెంబరు2: మండలంలోని చిట్టాపూర్‌ 44వ జాతీయరహదారిపై ప్రమాదవశాత్తు డివైడర్‌కు ఢీకొని రాథోడ్‌ ఉమేష్‌(30) అక్కడికక్కడే మృతి చెందినట్టు బాల్కొండ ఎస్సై రాజేందర్‌ తెలిపారు. ఎస్పై తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా అబ్బగంటి తండాకు చెందిన రాథోడ్‌ ఉమేష్‌ బైక్‌పై గురువారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాస్‌పోర్టు ఆఫీస్‌కు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో చిట్టాపూర్‌చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొంది. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో ఉమేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య హంజురిబాయి, కొడుకు కన్నయ్య, కూతురు చిన్న ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-09-03T05:42:50+05:30 IST