ఆశ కార్యకర్తల మహా పాదయాత్ర
ABN , First Publish Date - 2021-10-30T05:12:59+05:30 IST
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని బోర్గాం(పి) బ్రిడ్జీ నుంచి కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు.

నిజామాబాద్‌అర్బన్, అక్టోబరు 29: ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని బోర్గాం(పి) బ్రిడ్జీ నుంచి కలెక్టరేట్ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ ఆశ వర్కర్లను ఈ ప్రభుత్వం మోసం చేసిందని, పీఆర్‌సీ ప్రకటించి నాలుగు నెలలు గడిచిన ఇంకా వేతనాల పెంచకుండా బడ్జెట్ కేటాయించకుండా మోసం చేస్తున్నారన్నారు. పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఫిక్స్‌డ్ వేతనం చెల్లిస్తుండగా ఇక్కడ మాత్రం శ్రమదోపిడి చేస్తున్నారన్నారు. ఆశ వర్కర్లపై అధికారుల వేధింపులు ఆపాలని కనీస వేతనాలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్త మహాపాదయాత్రకు పిలుపునిచ్చి ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామన్నారు. పాదయాత్రకు అన్ని ప్రజా సంఘాల నాయకులు రమేష్‌బాబు, రామ్మోహన్‌రావు, మల్యాల గోవర్ధన్, సుజాత, లావణ్య, వెంకట్రాములు, గంగాధర్, నారాయణ, తదితరులు సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఆశ వర్కర్ల యూనియన్ ప్రతినిధులు రాజమణి, సుఖన్య,రేణుకా, భాగ్య, నవనీత, తదితరులు పాల్గొన్నారు.