కేరళ ఎన్నికల మీడియా ఇన్‌చార్జిగా మధుయాష్కీ

ABN , First Publish Date - 2021-03-15T04:14:13+05:30 IST

త్వరలో జరగనున్న కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ తరఫున మీడియా ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ నియమితులయ్యారు.

కేరళ ఎన్నికల మీడియా ఇన్‌చార్జిగా మధుయాష్కీ

నిజామాబాద్‌అర్బన్‌, మార్చి 14: త్వరలో జరగనున్న కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ తరఫున మీడియా ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ నియమితులయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సుఖ్‌జీవాలా మధుయాష్కీని నియమించారు. మధుయాష్కితో పాటు మరో జాతీయ అధికార ప్రతినిధి పవన్‌కేరాను మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. తిరువనంతపురం, కొచ్చిన్‌ నుంచి మీడియా బాధ్యతలన్నీ సమన్వయ పరచాలని పార్టీ విజయానికి ప్రచారం కల్పించాలని ఏఐసీసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రచార వివరాలను కేరళలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు జాతీయ కార్యాలయానికి సమాచారం ఇస్తూ జాతీయ నాయకులతో నిత్యం సంప్రదింపులు జరపాలని ఏఐసీసీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మధుయాష్కీ గతంలో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో ఎన్నికల ఇన్‌చార్జి పనిచేశారు. 


Updated Date - 2021-03-15T04:14:13+05:30 IST