సిద్ధరామేశ్వర స్వామిని దర్శించుకున్న మాధవానంద సరస్వతీ

ABN , First Publish Date - 2021-10-04T04:22:00+05:30 IST

మండలంలోని దక్షిణకాశీగా బాసిల్లుతున్న సిద్ధరామేశ్వర ఆలయాన్ని ఆదివారం రంగపేట్‌ పీఠాధిపతి మాధవా నంద సరస్వతీ స్వామీజీ సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నా రు.

సిద్ధరామేశ్వర స్వామిని దర్శించుకున్న మాధవానంద సరస్వతీ
ఆలయాన్ని సందర్శిస్తున్న స్వామీజీ

భిక్కనూరు, అక్టోబరు 3: మండలంలోని దక్షిణకాశీగా బాసిల్లుతున్న సిద్ధరామేశ్వర ఆలయాన్ని ఆదివారం రంగపేట్‌ పీఠాధిపతి మాధవా నంద సరస్వతీ స్వామీజీ సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నా రు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి మార్పులు, చేర్పులకు ఆలయ కమిటీ ప్రతినిధులకు పలు సూచన లు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, సిబ్బంది ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ నర్సింహా రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ తునికి వేణు, నాయకులు నాగభూషణంగౌడ్‌, భగవంత్‌రెడ్డి, అంబళ్ల మల్లేషం, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-04T04:22:00+05:30 IST