రెండేళ్లుగా ఎదురుచూపులే!

ABN , First Publish Date - 2021-03-02T05:18:26+05:30 IST

జిల్లాలోని గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ నిలిచిపో యి రెండేళ్లు దాటింది. రెండో విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీచేయకపోవడంతో ఆ ందోళన చెందుతున్నారు. అఽధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులను కలుస్తూ తమకు గొర్రెలను పంపిణీ చేయించాలని కోరుతున్నారు.

రెండేళ్లుగా ఎదురుచూపులే!

జిల్లాలో రెండేళ్లుగా పంపిణీకాని గొర్రెలు

రెండో విడత పంపిణీకి పూర్తయిన లబ్ధిదారుల ఎంపిక  

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయంటున్న అధికారులు 

నిజామాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ నిలిచిపో యి రెండేళ్లు దాటింది. రెండో విడతలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీచేయకపోవడంతో ఆ ందోళన చెందుతున్నారు. అఽధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులను కలుస్తూ తమకు గొర్రెలను పంపిణీ చేయించాలని కోరుతున్నారు. కొంతమ ంది లబ్ధిదారులు గొర్రెల పంపిణీ ఆలస్యమవుతుండడంతో తమ డీడీలను వాపస్‌ తీసుకున్నారు. ప్రభు త్వం మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

2017-18లో ప్రారంభమైన పథకం

రాష్ట్ర పభుత్వం గొల్లకుర్మల ఆర్థికాభివృద్ధి కోసం 2017-18 ఆర్థిక సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. వారికి సబ్సిడీ కింద గొర్రెలను అందించేందుకు నిర్ణయించింది. ఈ పథకంకింద ఒక లక్షా 25వేల రూపాయలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ను ప్రతీ యూనిట్‌కు అందించారు. లబ్ధిదారుని సబ్సి డీ 31,250 రూపాయలను డీడీ రూపంలో అందిస్తే మిగతా డబ్బులను ప్రభుత్వం కలిపి గొర్రెలను కొని పంపిణీ చేసింది. పొరుగున గల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర నుంచి గొర్రెలను తీసుకువచ్చి గొల్లకుర్మలకు పంపిణీ చేశారు. 

మొదటి విడతలో 8,552 మందికి పంపిణీ

జిల్లాలో మొదటి విడతలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో 9,631 మంది లబ్ధిదారులను ఎంపిక చేశా రు. వారిలో 8,552 మందికి గొర్రెల యూనిట్లను పం పిణీ చేశారు. వీరికోసం జిల్లాలో 106.55 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రెండో విడత కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 9,475 మందిని ఎంపిక చేశారు. వీరిలో 1,103 మందికి మాత్రమే గొర్రెలను పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వరు స ఎన్నికలు రావడంతో గొర్రెల పంపిణీని నిలిపివేశా రు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు మిగిలిన లబ్ధిదా రులకు గొర్రెల పంపిణీని మొదలుపెట్టలేదు. జిల్లాలో రెండో విడత ఎంపికైన వారిలో 4,020 మంది డీడీలు కూడా కట్టారు. గొర్రెల పంపిణీ ఆలస్యమవుతుండడ ంతో 2,963 మంది లబ్ధిదారులు డీడీలను వాపస్‌ తీ సుకున్నారు. మిగతావారు గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. పలుమార్లు అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కేసీఆర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. రెండు నెలల క్రితం ఇతర జిల్లాల్లో ప్రాథమికంగా ప్రారంభించి నిలిపివేయడంతో ఆర్థిక సంవత్స రం ముగుస్తున్నందున ఈ దఫా ప్రారంభిస్తారని గొ ల్లకుర్మలు ఎదురుచూస్తున్నారు. మొదటి విడత లబ్ధిదారులకు ఇచ్చినవిధంగానే తమకు గొర్రెలను పంపి ణీ చేయాలని కోరుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులకు విన్నవిస్తున్నారు. కరోనా, ఇ తర ఆర్థిక సమస్యలతో ఇప్పటి వరకు గొర్రెల పంపి ణీ మాత్రం పూర్తిస్థాయిలో చేపట్టలేదు. కొన్ని జిల్లా ల్లో మొదలైనా ఇక్కడ మాత్రం ప్రారంభంకాలేదు. రెండో విడత ఎంపికైన లబ్ధిదారులు మాత్రం గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలని కోరుతున్నారు. 

త్వరలో పంపిణీ చేస్తామంటున్న అధికారులు

ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే గొర్రెల పంపిణీ మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికోసం నిబంధనలు కూడా మార్చినట్లు అధికారుల సమాచారం బట్టి తెలుస్తోంది. గతంలో గొర్రెలను జిల్లా అధికారులే ఎంపికచేసిన ప్రాంతాల కు వెళ్లి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ నిబంధనలను మార్చినట్లు తెలుస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం రాష్ట్రస్థాయిలో 20 మంది ఏడీలతో క మిటీని ఏర్పాటు చేశారు. వారే ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేస్తారు. ఎంపిక చే సిన లబ్ధిదారులకు పంపిస్తారు. గొర్రెలను కొనుగోలు చేసే సమయంలోనే లబ్ధిదారులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్తారు. వారి సమక్షంలోనే కొనుగోలు చేయడం తో పాటు గొర్రెలకు బీమా కూడా చేస్తారు. ఆ గొర్రెలు జిల్లాకు వచ్చిన తర్వాత ఆ గ్రామాలకు వెళ్లి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు పరిశీలించి నివేదికను పంపిస్తారు. గొర్రెలు నిబంధనల మేరకు లేకుంటే వాటిని తిప్పి పంపిస్తారు. రాష్ట్రంలో గొర్రెలు కొనేందు కు మహారాష్ట్రలోని నాందేడ్‌, సోలాపూర్‌, చంద్రాపూ ర్‌, ఏపీలోని అనంతపురం, కృష్ణ, గంటూరు, కర్నూ లు, కడప, కర్ణాటకలోని యాద్గిర్‌, చిత్రదుర్గ, బల్లారి తో పాటు ఇతర ప్రాంతాలను ఎంపికచేసినట్లు తెలిసి ంది. ఈ గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఒకటి రెం డు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిసింది.  ఇప్పటికే జిల్లా అధికారులను సిద్ధంగా ఉండాలని ప్ర భుత్వం సూచించినట్టు తెలిసింది. పశుసంవర్ధకశాఖ అధికారులు కూడా ఆయా మండలాల అధికారులతో గొర్రెల పంపిణీపై సమీక్షించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లాలో రెండో విడత ఎంపిక చేసి న వారికి అందించనున్నారు. పశుసంవర్ధకశాఖ రాష్ట్ర అధికారుల ఆదేశాల ప్రకారం గొర్రెలను కొనుగోలు చే సి జిల్లాలోని ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ పంపి ణీ చేసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-03-02T05:18:26+05:30 IST