ఇక ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లు

ABN , First Publish Date - 2021-07-12T05:52:34+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో ప్రజల అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సూవాడ మున్సిపాలిటీల పరిదిలో ఈ మార్కెట్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిధులను సైతం విడుదల చేసింది.

ఇక ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లు
ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌గా మారనున్న డీఈవో కార్యాలయ ఆవరణ

 త్వరలో ఉమ్మడి జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ల నిర్మాణాలు
 నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం.. ప్రారంభమైన పనులు

నిజామాబాద్‌, జూలైౖ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో ప్రజల అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీంగల్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సూవాడ మున్సిపాలిటీల పరిదిలో ఈ మార్కెట్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిధులను సైతం విడుదల చేసింది. త్వరగా టెండర్‌లు పిలిచి పనులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని మున్సిపాలిటీల్లో టెండర్‌లను పిలవడంతో పా టు నిర్మాణాలను కూడా మొదలుపెట్టారు.
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో కూరగాయలు, పండ్లు, ఇతర ని త్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ మా ర్కెట్‌లను మంజూరి చేసింది. నగర కార్పొరేషన్‌తో పాటు బోధన్‌, ఆర్మూర్‌, కా మారెడ్డి మున్సిపాలిటీల్లో నిర్మించే ఈ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లకు నాలుగున్నర లక్షల చొప్పున ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇవేకాకుండా ఇతర నిర్మాణాల కోసం నిధులను కేటాయించింది. భీంగల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో ఈ మార్కెట్‌లకు రెండు కోట్ల చొప్పున నిధులను మంజూరు చేస్తూ ఉ త్తర్వులను జారీ చేసింది. భీంగల్‌, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో ఈ పనులు టెండరింగ్‌ దశల్లో ఉండగా మిగతా మున్సిపాలిటీల్లో టెండర్‌లు పూర్తయి ప నులు మొదలుపెట్టారు. నిర్ణీత సమయంలో పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చారు.
ఫ నగరంలో మూడు మార్కెట్‌లు
నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో మూడు ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌లకు ప్ర భుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మార్కెట్‌లకు ఒక్కొక్కటికి నాలుగున్నర కోట్ల చొ ప్పున పదమూడున్నర కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు అదనపు నిర్మాణాల కోసం మరో రూ.9 కోట్ల నిధులను మంజూరు చేసింది. నగరంలోని ఖలీల్‌వాడి, శ్రద్దానంద్‌గంజ్‌, బోధన్‌ రోడ్డులో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఖలీల్‌వాడిలోని డీఈవో కార్యాలయంను కొత్త కలెక్టరేట్‌కు తరలిస్తుండడంతో దాని స్థానంలో ఈ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం చేపడుతున్నారు. టెండర్‌లు పూర్తికావడంతో పనులను మొదలుపెట్టారు. ఈ మార్కెట్‌ నిర్మాణానికి నాలుగున్నర కోట్లు వెచ్చిస్తుండగా వాహనాల నిలుపుస్థలంతో పాటు ఇతర వసతుల కోసం మరో 3 కోట్లను ఖర్చు చేస్తున్నారు. నగరంలోని శ్రద్దానంద్‌గంజ్‌, బోధన్‌ రోడ్డులోని ఇంటి గ్రేటెడ్‌ మార్కెట్‌ల నిర్మాణం ఇంకా టెండర్‌లను ఖరారు చేయలేదు. టెండర్‌లు పూర్తికాగానే ఆ నిర్మాణాలు కూడా చేయనున్నారు. ప్రజల అవసరాల కోసం ఒక అధునాతనమైన మార్కెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ఈ నిర్మాణాలను చేస్తున్నారు. ప్రస్తుతం నగరం పరిధిలో గంజ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్‌కు అనువైన స్థలాలు లేకపోవడంతో ఈ మూ డు మార్కెట్‌ల నిర్మాణాలు చేస్తున్నారు. నగర ప్రజలందరికీ అందుబాటులో ఉం డేవిధంగా ఈ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని టెండర్‌లుకాని భీంగల్‌, ఎల్లారెడ్డి మినహా మిగతా మున్సిపాలిటీల్లో పనులను మొదలుపెట్టారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో ఒకటి రెండు రోజుల్లో టెండర్‌లను ఖరారు చేయనున్నారు. నగర కార్పొరేషన్‌ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ల నిర్మాణం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌శాఖ అధికారులు చేస్తున్నారు. మిగతా ఆరు మున్సిపాలిటీల్లో ఈ నిర్మాణాలను ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యం లో కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లకు ప్ర భుత్వం అనుమతులు ఇచ్చి నిధులను మంజూరు చేసిందని పబ్లిక్‌ హెల్త్‌ ఇంజ నీరింగ్‌శాఖ ఈఈ మురళి తెలిపారు. భీంగల్‌, ఎల్లారెడ్డి టెండర్‌లను త్వరలో ఖరారు చేస్తామన్నారు. మిగతా మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - 2021-07-12T05:52:34+05:30 IST