పరిశోధనలతోనే సాహిత్య వికాసం

ABN , First Publish Date - 2021-04-08T04:56:18+05:30 IST

పరిశోధనలతోనే మేలైన సాహిత్య వికాసం జరు గుతుందని ప్రముఖ జానపద పరిశోధకులు, ఆచార్య ఆర్వీఎస్‌ సుం దరం అన్నారు.

పరిశోధనలతోనే సాహిత్య వికాసం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7: పరిశోధనలతోనే మేలైన సాహిత్య వికాసం జరు గుతుందని ప్రముఖ జానపద పరిశోధకులు, ఆచార్య ఆర్వీఎస్‌ సుం దరం అన్నారు. బుధవారం టీయూ తెలుగు  అధ్యయన శాఖను ఆయ న  సంద ర్శించారు.  తెలుగు విభాగానికి చెందిన సిబ్బంది ఘన స్వాగ తం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ... టీయూలోని తెలుగు అధ్యయన శాఖలో జరుగుతున్న సాహిత్య సేవను, పరిశోధనలను గురించి తెలుసుకొని ప్రశంసించారు. వర్సిటీ తెలుగు అధ్యయన శాఖ అధ్యాపకులందరు సుందరం గారిని గురించి తమ తమ వ్యక్తిగత సాహిత్య పరిశోధక అనుభవాలను తెలియజేశారు. తెలుగు కన్నడ దళిత కథా సాహిత్యం మీద పరిశోధన చేస్తున్న ఆయన మనువరాలు పవిత్ర ఆచార్య పి.కనకయ్యను ఇంటార్వ్యు చేశారు. కార్య క్రమంలో టీయూ తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్లు కనకయ్య, బాలశ్రీనివాస మూర్తి, త్రివేణి, లావణ్య, లక్ష్మణ చక్రవర్తి, పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-08T04:56:18+05:30 IST