దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో మద్యం సిట్టింగ్‌లు!

ABN , First Publish Date - 2021-06-23T05:27:22+05:30 IST

జిల్లాలో దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు మద్యం సిట్టింగ్‌లకు అడ్డాలుగా మారా యి. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం సిట్టింగ్‌ లు కొనసాగుతున్నాయి.

దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో మద్యం సిట్టింగ్‌లు!
బోధన్‌ శివారులో దాబాలో దాడి చేసి మద్యం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ సీఐ

దాబాలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు
అనుమతులు లేకుండా మద్యం  సిట్టింగ్‌లపై నజర్‌
బోధన్‌లో రెండు దాబాలపై కేసులు

బోధన్‌, జూన్‌ 22: జిల్లాలో దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లు మద్యం సిట్టింగ్‌లకు అడ్డాలుగా మారా యి. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం సిట్టింగ్‌ లు కొనసాగుతున్నాయి. ఉదయం 10గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెం టర్‌లలో మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. దీంతో ఎక్సైజ్‌శాఖ వీటిపై దృష్టి పెట్టింది. అనుమతు లు లేకుండా దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లలో మ ద్యం సిట్టింగ్‌లు కొనసాగుతుండడంతో అనుమతు లు పొంది ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు చెల్లి స్తున్న బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు బోసిపోతున్నాయి. ప్రభుత్వానికి ప్రతియేటా లక్షలాది రూపాయలు చె ల్లించి అనుమతులు పొందుతున్న బార్‌ అండ్‌ రెస్టా రెంట్‌లు దాబాలు, ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ల వల్ల మద్యం బాబులు లేక, మద్యం తాగేందుకు వచ్చే వారు లేక రోజంతా గిరాకీలు లేక పెట్టిన పెట్టుబడులు రాక అ ప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. ఈ పరిణామాల తో ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు బార్‌ అండ్‌ రెస్టారె ంట్‌లు మూతపడడానికి, ప్రభుత్వ ఆదాయానికి గం డి పడడానికి ప్రధాన కారణం దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లేనని గుర్తించి అనుమతులు లేని సిట్టింగ్‌ అడ్డాలపై దాడులకు సిద్ధమయ్యారు.
పగలు, రాత్రి సిట్టింగ్‌లు
జిల్లాలో దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లలో పగలు రాత్రి తేడా లేకుండా మద్యం సిట్టింగ్‌లు కొనసాగు తున్నాయి. ఉదయం 10 నుంచి అర్థరాత్రి 12 వరకు మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. జిల్లాలో గ త ఏడాది కాలంగా దాబాలు విచ్చలవిడిగా మారా యి. ఒక్కో మండలంలో కనీసం పది వరకు దాబా లు కొనసాగుతున్నాయంటే దాబాల దందా ఎంత విచ్చలవిడిగా మారిందో చెప్పనక్కర్లేదు. ప్రభుత్వాని కి రూపాయి చెల్లించకుండా అడ్డగోలుగా పగలు, రా త్రి మద్యం సిట్టింగ్‌లను చేపడుతున్నారు. జిల్లాలో సుమారు 500 పైనే దాబాలు కొనసాగుతున్నాయం టే పరిస్థితులు అంచనా వేసుకోవచ్చు. బోధన్‌, బా న్సువాడ ప్రధాన రహదారి, బాన్సువాడ నిజామాబా ద్‌ ప్రధాన రహదారి, బోధన్‌ నిజామాబాద్‌ ప్రధాన రహదారి, బోధన్‌ నాందేడ్‌ ప్రధాన రహదారి, రు ద్రూరు బీర్కూర్‌ రహదారుల పొడవునా దాబాలు విచ్చలవిడిగా మారాయి. పగలు రాత్రి తేడా లేకు ండా సిట్టింగ్‌లు చేపడుతూ రోడ్డు ప్రమాదాలకు కా రణమవుతున్నారు. మరోవైపు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల ముసుగులో మద్యం సిట్టింగ్‌లు యథేచ్ఛగా మారా యి. చూసేందుకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లుగానే ఉన్న మద్యం సిట్టింగ్‌లు చేపడుతున్నారు.
 దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల దాడులు
బోధన్‌ ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్‌శాఖ రా ష్ట్ర, జిల్లా ఉన్నత అధికారుల మేరకు అక్రమ సిట్టిం గ్‌ అడ్డాలపై దాడులు మొదలయ్యాయి. బోధన్‌ ఎక్సై జ్‌ సీఐ బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఆయా మండలాలలో ఎక్సైజ్‌ ఎస్సైలు దాడులు చేపడుతున్నారు. సోమవా రం రాత్రి నుంచి మొదలైన దాడులు మంగళవారం వరకు కొనసాగాయి. సోమవారం రాత్రి బోధన్‌ పట్ట ణ శివారు, బోధన్‌ పరిసర ప్రాంతాలలోని దాబాల పై దాడులు చేపట్టారు. అక్రమంగా సిట్టింగ్‌లు చేప డుతున్న దాబాలపై దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఏకకాలంలో బోధన్‌తోపాటు బోధన్‌ శివారులలో దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల పై దాడులు చేపట్టారు. బోధన్‌ సర్కిల్‌ పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా, ఎడ పల్లి, రెంజల్‌ మండలాలలో దాడులు చేపట్టేందుకు ఎక్సైజ్‌శాఖ సిద్ధమవుతోంది.
రెండు దాబాలపై కేసులు
బోధన్‌, బోధన్‌ పరిసర ప్రాంతాలలో ఎక్సైజ్‌శాఖ అనుమతులు లేని సిట్టింగ్‌ అడ్డాలపై దృష్టి పెట్టింది. ప్రధానంగా దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లపై నజరు వేసింది. ఏకకాలంలో దాడులుచేపట్టేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. సోమవారం రాత్రి బో ధన్‌ పరిసర ప్రాంతాలలో సుమారు పది దాబాల పైనే దాడులు చేపట్టగా రెండు దాబాలలో మద్యం సిట్టింగ్‌లు నిర్వహిస్తుండడతో మద్యాన్ని స్వాధీనప ర్చుకొని దాబా యజమానులపై ఎక్సైజ్‌శాఖ కేసులు నమోదు చేసింది.
సిట్టింగ్‌లు నిర్వహిస్తే కేసులు
- బాల్‌రాజ్‌, ఎక్సైజ్‌ సీఐ బోధన్‌

బోధన్‌ సర్కిల్‌ పరిధిలో దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెం టర్‌లలో మద్యం సిట్టింగ్‌లు నిర్వహిస్తే కేసులు న మోదు చేస్తాం. దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ల వల్ల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు మూతపడుతున్నాయి. ప్ర భుత్వం ఆదాయం కోల్పోతోంది. ఎక్సైజ్‌ శాఖ ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లపై దాడులు కొనసాగుతాయి. మద్యం సిట్టి ంగ్‌లు నిర్వహిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం. బోధన్‌లో ఇద్దరు దాబా యజమానులపై కే సులు చేశాం. నిబంధనలు పాటించని వారిపై కేసు లు నమోదు చేస్తాం.

Updated Date - 2021-06-23T05:27:22+05:30 IST