తల్లిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు
ABN , First Publish Date - 2021-12-30T06:48:01+05:30 IST
మహిళను హత్య చేసిన కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు విదిస్తూ న్యాయమూర్తి ఎస్‌వీపీ.సూర్యచంద్రకళ బుధవారం తీర్పు చెప్పారు.

ఖిల్లా, రుద్రూరు, డిసెంబరు 29: మహిళను హత్య చేసిన కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు విదిస్తూ న్యాయమూర్తి ఎస్‌వీపీ.సూర్యచంద్రకళ బుధవారం తీర్పు చెప్పారు. జీవిత ఖైదుతోపాటు రూ.వెయ్యి జరిమానా సైతం విధించారు. కేసుకు సంబంధించిన వాదనలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వినిపించారు. 2020 డిసెంబరు నెల 15వ తేదిన అర్ధరాత్రి రుద్రూర్ మండలంలోని అంబంగ్రామానికి చెందిన చిలపల్లి చిన్న సాయిలు తన తల్లి చినపల్లి సాయవ్వతో పింఛన్ డబ్బుల కోసం గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సాయిలు తల్లిని హత్య చేశాడు. రుద్రూర్ పోలీసులు కేసును నమోదు చేశారు. కోర్టు వాస్తవాలను విని తల్లిని చంపిన సాయిలు కు జీవితఖైదు విదిస్తూ తీర్పు చెప్పారు. కేసును చేదించడంలో కృషి చేసిన రుద్రూర్ సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ రవీంధర్, పీసీ కానిస్టేబుల్ సాయన్నను పోలీసు కమిషనర్ కేఆర్.నాగరాజు అభినందించారు.