మాదాపూర్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

ABN , First Publish Date - 2021-01-14T04:45:23+05:30 IST

మండలంలోని మాదాపూర్‌ అటవీ ప్రాంతంలో బుధవా రం సాయంత్రం చిరుత సం చరిం చడంతో గ్రామస్థులు భయాందోళనకు గుర య్యా రు.

మాదాపూర్‌ అటవీ ప్రాంతంలో చిరుత సంచారం
రాయిపై కూర్చున్న చిరుత

మాక్లూర్‌, జనవరి13: మండలంలోని మాదాపూర్‌ అటవీ ప్రాంతంలో బుధవా రం సాయంత్రం చిరుత సం చరిం చడంతో గ్రామస్థులు భయాందోళనకు గుర య్యా రు. వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు స మాచారం అందించారు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో చి రుత సంచరించిన చిరుత పశువులను, మేకలు హత మార్చింది. అనంతరం మామిడిపల్లి శివారులోని వ్యవసా య క్షేత్రంలో ఇనుప కంచెలో చిక్కుకుని మృత్యువాత పడింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్న స్థానికులకు తిరిగి మరో చిరుత బుధవారం కనిపించడంతో మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. మాదాపూర్‌ అటవీ ప్రాంతానికి ఇళ్లు అనుకొని ఉండడంతో రాత్రిళ్లు బయటకు ఎలా వెళ్లాలని ఆందోళనకు గురవుతున్నారు. పశువులు, గొర్రెల రక్షణ ఎలా అని వాపోతున్నారు. అధికారులు వెంటనే త్వరగా చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-01-14T04:45:23+05:30 IST