ప్రభుత్వ కళాశాలలో చేరాలని లెక్చరర్ల ప్రచారం

ABN , First Publish Date - 2021-05-30T06:51:30+05:30 IST

ఇప్పటి వరకు ప్రైవేట్‌ కళాశాలల్లో చేరాలని విద్యార్థుల కోసం ప్రచారాలు చేసే కళాశాలల యాజమాన్యాలు చేసేవి.

ప్రభుత్వ కళాశాలలో చేరాలని లెక్చరర్ల ప్రచారం

డిచ్‌పల్లి, మే 29: ఇప్పటి వరకు ప్రైవేట్‌ కళాశాలల్లో చేరాలని విద్యార్థుల కోసం ప్రచారాలు చేసే కళాశాలల యాజమాన్యాలు చేసేవి. కానీ డిచ్‌పల్లి ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలో చేరాలని ప్రిన్సిపాల్‌ చంద్రవిఠల్‌ ఆధ్వర్యంలో బ్యాన ర్లు పట్టుకుని ప్రచారం చేపట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కళాశాలలో లెక్చరరల్‌ ల బోధన కారణంగా వందశాతం ఉత్తీర్ణతతోపాటు విద్యార్థులకు జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాపోటీలు, ఉపకారవేతనాలు, మెరుగైన ల్యాబ్‌లు, విద్యార్థుల మేధాసంపత్తికి గ్రంథాలయం ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రైవేట్‌ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల లెక్చరర్‌లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గమనించదగ్గ విషయం.

Updated Date - 2021-05-30T06:51:30+05:30 IST