రైతు చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-02-07T03:11:32+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టిన అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజే శారు.

బోధన్, ఫిబ్రవరి 6: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఆందోళన చేపట్టిన అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కార్యక్రమంలో అ ధ్యక్షుడు గంగాధర్‌అప్ప, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ పాల్గొన్నారు.
మోపాల్ : నగరంలోని బోర్గాం (పి) బ్రిడ్జిపై అఖిలపక్ష నాయకులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తాహెర్‌బిన్ హుం దాన్, వి.ప్రభాకర్, ఆకుల పాపయ్య, పెద్ది వెంకట్రాములు, రమేష్ బాబు, నూర్జహన్, సబ్బనిలత మాట్లాడారు. రైతులు ఢిల్లీలో 72 రోజులుగా ఆం దోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. పోలీసు బలగాలతో రైతు ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
నిజామాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాస్తారోకోలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాలమోహన్‌రెడ్డితో పాటు నగర అధ్యక్షుడు కేశవేణు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఆర్మూర్: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆర్మూర్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బొట్ల రాజు, కుతాడి ఎల్లయ్య పాల్గొన్నారు.
కమ్మర్‌పల్లి : మండలకేంద్రంలో ఏఐకెఎమ్మెస్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సారాసురేష్, బాలయ్య, అశోక్, కిషన్, భానుచెందర్, సుంకెట రవి పాల్గొన్నారు.