లారీ ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-12-28T05:30:00+05:30 IST

మండలంలోని వాజీద్‌నగర్‌ వద్ద లారీ ఢీకొని రూప్‌సింగ్‌ (45) అనే వ్యక్తి మృతిచెందినట్లు సీఐ శోభన్‌ తెలిపారు.

లారీ ఢీకొని ఒకరి మృతి


బిచ్కుంద,డిసెంబరు 28: మండలంలోని వాజీద్‌నగర్‌ వద్ద లారీ ఢీకొని రూప్‌సింగ్‌ (45) అనే వ్యక్తి మృతిచెందినట్లు సీఐ శోభన్‌ తెలిపారు. బిచ్కుందలోని ఐటీఐ కళాశాలలో విధులు నిర్వహించుకుని బైక్‌పై రూప్‌సింగ్‌ బాన్సువాడ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టడంతో రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలో పడి అక్కడిక్కడే మృతిచెందడని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-12-28T05:30:00+05:30 IST