కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-13T05:46:23+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం సూచించిన నిబం ధనలను ప్రజలందరు పాటించాలని తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, రూరల్‌ సీఐ విజ య్‌కుమార్‌, వేల్పూర్‌ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి ప్రజలకు సూచించారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

వేల్పూర్‌, మే12: కొవిడ్‌ వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం సూచించిన నిబం ధనలను ప్రజలందరు పాటించాలని తహసీల్దార్‌ సతీష్‌రెడ్డి, రూరల్‌ సీఐ విజ య్‌కుమార్‌, వేల్పూర్‌ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి ప్రజలకు సూచించారు.  మండలం లోని జాన్కంపేట్‌, వేల్పూర్‌, పడిగెల, పచ్చలనడ్కుడ, లక్కోర, వెంకటాపూర్‌, మోతె, రామన్నపేట్‌, అంక్సాపూర్‌ తదితర గ్రామాల్లో బుధవారం వారు పర్యటించారు. ఆయా గ్రామాల్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కొవిడ్‌ వైరస్‌ను అరికట్డం కోసం తీసుకుంటున్న చర్యలు, కొనసాగుతున్న లాక్‌డౌన్‌ పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థులందరు తమ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు. నిబంధనలను, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2021-05-13T05:46:23+05:30 IST