బోధన్‌ బస్టాండ్‌లో కొవిడ్‌ పరీక్షా కేంద్రం

ABN , First Publish Date - 2021-02-27T05:00:47+05:30 IST

పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంగణంలో పాన్‌గల్లి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

బోధన్‌ బస్టాండ్‌లో కొవిడ్‌ పరీక్షా కేంద్రం

బోధన్‌రూరల్‌, ఫిబ్రవరి 26 : పట్టణంలోని బస్టాండ్‌ ప్రాంగణంలో పాన్‌గల్లి ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం మహారాష్ట్ర బస్సులు ఆగే ప్రాంతంలో మహా రాష్ట్ర వాసులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 165 మందికి పరీక్షలు నిర్వహించగా అన్ని నెగిటివ్‌ వచ్చాయని ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ ఆర్గనైజర్‌ సత్యనారాయణ తెలిపారు. 

సాలూర చెక్‌పోస్టులో 91 మందికి కరోనా పరీక్షలు

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సాలూర చెక్‌పోస్టులో శుక్రవారం 91 మందికి పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేఖ తెలిపారు.  


Updated Date - 2021-02-27T05:00:47+05:30 IST