కిడ్నాప్‌ ముఠా రిమాండ్‌

ABN , First Publish Date - 2021-03-22T05:42:59+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు సంవత్సరాల క్రితం గణేష్‌ అనే బాలుడి కిడ్నాప్‌ చేసి విక్ర యించిన ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపిన ట్లు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు.

కిడ్నాప్‌ ముఠా రిమాండ్‌

కామారెడ్డి,మార్చి 21: కామారెడ్డి జిల్లా కేంద్రంలో రెండు సంవత్సరాల క్రితం గణేష్‌ అనే బాలుడి కిడ్నాప్‌ చేసి విక్ర యించిన ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపిన ట్లు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలే కరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కామారెడ్డి పట్టణా నికి చెందిన నజీర్‌, అతడి భార్య యాస్మిన్‌, షబానాబేగం గణే ష్‌ అనే బాలుడిని కిడ్నాప్‌ చేసి హైదరాబాద్‌లోని మహమ్మద్‌ యూసఫ్‌, జైబునిలకు విక్రయించారని తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో నజీర్‌ అనుమానాస్పదంగా సంచరిస్తుండ డంతో పట్టుకొని విచారించడంతో గణేష్‌ను కిడ్నాప్‌ చేసిన విషయాన్ని అంగీకరించినట్లు తెలిపారు. గతంలోనూ నజీర్‌ ఒక కిడ్నాప్‌ చేసి జైలుకు సైతం వెళ్లాడని తెలిపారు. ప్రస్తుతం గణేష్‌ను కిడ్నాప్‌ చేసి విక్రయించి మరోమారు పట్టుబడాడని తెలిపారు. ఈ కిడ్నాప్‌లో పాల్గొన యాస్మిన్‌,షబానాభేగంలను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసును ఛేదించిన సీఐ మధేసూదన్‌, ఎస్‌ఐ శేఖర్‌, సిబ్బంది గణపతి, గోదావరి, యాస్మిన్‌లను అభినందిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-03-22T05:42:59+05:30 IST