నేటి నుంచి ఖండేరాయ దేవాలయ వార్షికోత్సవాలు
ABN , First Publish Date - 2021-03-01T05:14:22+05:30 IST
మండలంలోని ఉత్తునూర్ ఖండేరాయ ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు కమిటీ చైర్మన్ గణేష్ తెలిపారు.
సదాశివనగర్, ఫిబ్రవరి 28: మండలంలోని ఉత్తునూర్ ఖండేరాయ ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు కమిటీ చైర్మన్ గణేష్ తెలిపారు. ఉదయం 9గంటలకు పుణ్యాహవచనం, ధ్వజారోహణం, మండ ప పూజ, మంగళవారం మూలవిరాట్‌కు సహస్ర పూజ, బోనాల ఊరేగింపు, బుధవారం దేవతాపూజా ఖండేరాయ మాండాళ్ల మ్మ కల్యాణం, గురువారం అగ్ని గుండాలు రఽథోత్సవం నిర్వహి ంచడం జరుగుతుందన్నారు. ప్రజలందరు పాల్గొని స్వామి వారి సేవకు పాత్రులు కావాలని తెలిపారు.
భక్తులకు కొంగు బంగారం ఖండేరాయ ఆలయం
ఉత్తునూర్‌లో వెలిసిన ఖండేరాయ మాండాళ్లమ్మ దేవాల యం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. జాతీయ రహదారికి 4కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయ వార్షికోత్సవా నికి అనేక గ్రామాల భక్తులు వేలాదిగా తరలివస్తారు. అందుకు తగిన ఏర్పాట్లను గ్రామాభివృద్ధి పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు. గర్భగుడిలో ఒకే పట్టముపై రెండు లింగాలను ఏర్పాటు చేయడం ఆలయ ప్రత్యేకత.
18 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం
ఉత్తునూర్ గ్రామస్థులు 18 సంవత్సరాల క్రితం రాతి కట్టడం తో ఉన్న ఈ ఆలయాన్ని విరాళాలు సేకరించి పునఃనిర్మాణం చేశారు. ఆలయంలో ప్రతీ సోమవారం అర్చకులు క్రమం తప్ప కుండా అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తుంటారు. ప్రతీ ఏటా మాఘ బహుళ విధియ నుంచి ఆలయ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఖండేరాయ మాండాళ్లమ్మ కల్యాణం అంగరంగ వైభ వంగా నిర్వహిస్తారు.