రెండు గంటలు ఆలస్యంగా జిల్లాకు కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-21T06:28:40+05:30 IST

జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్‌ రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. సిద్దిపేటలో కలెక్టరేట్‌, పోలీసు కమిషనర్‌ కార్యాలయాల ప్రారంభోత్సవం తర్వాత షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 2.30గంటలకు కేసీఆర్‌ కామారెడ్డికి చేరుకోవాల్సి ఉంది.

రెండు గంటలు ఆలస్యంగా జిల్లాకు కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి టౌన్‌, జూన్‌ 20: జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్‌ రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. సిద్దిపేటలో కలెక్టరేట్‌, పోలీసు కమిషనర్‌ కార్యాలయాల ప్రారంభోత్సవం తర్వాత షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 2.30గంటలకు కేసీఆర్‌ కామారెడ్డికి చేరుకోవాల్సి ఉంది. కానీ సాయ ంత్రం 5.30గంటలకు కేసీఆర్‌ హెలీక్యాప్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. ఆయనకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి,ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ తదితరులు స్వాగతం పలికారు. 5:40గంటలకు ఎస్పీ కార్యాలయాన్ని, 6:18 గంటలకు కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. రాత్రి 8:30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెలీక్యాప్టర్‌లో కాకుండా భారీ కాన్వాయ్‌ ద్వారా రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.

Updated Date - 2021-06-21T06:28:40+05:30 IST