కామారెడ్డిని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దే

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీ ఆర్‌కే దక్కుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్ర మలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కామారెడ్డిని జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దే
ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌


కామారెడ్డిలో షబ్బీర్‌అలీ చేసిన అభివృద్ధి శూన్యం  
బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారు
గతంలో మాదిరిగానే కేంద్రం ధాన్యం కొనాలి
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతు ఉద్యమం చేపడుతాం  
త్వరలోనే 22వ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తాం
టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చిన  మంత్రి కేటీఆర్‌
కామారెడ్డిలో టీఆర్‌ఎస్‌  కార్యకర్తల సమావేశం


కామారెడ్డి(ఆంధ్రజ్యోతి)/ కామారెడ్డి/బీబీపేట, నవంబరు 9:
కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీ ఆర్‌కే దక్కుతుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్ర మలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల రైతాం గానికి గోదావరి నుంచి సాగునీటిని అందించేందుకు 21వ ప్యాకే జీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తవుతాయన్నారు. అంతకుముందు బీబీపేటలో నిర్మించిన ప్ర భుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి కర్షక్‌ బీఈడీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన టీఆర్‌ ఎస్‌ కార్యకర్తల సమావేశ సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. విప్‌ గంప గోవర్ధన్‌ నేతృత్వంలో కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. కామారెడ్డిని అభివృద్ధి చేయని షబ్బీర్‌అలీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌పై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరెంట్‌ మంత్రి గా ఉన్న షబ్బీర్‌ అలీ రైతాంగానికి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సరాఫరా చేయ కుండా విఫలమయ్యారన్నారు. ఎన్నికల సమయంలో పసుపు రైతులకు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసం చేసిన ఓ ఎంపీ రైతుల గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ బండి సం జయేనని ఎద్దే వా చేశారు. కొన్నిరోజులుగా బీజేపీ, కాంగ్రెస్‌ నేత లు సీఎం కేసీ ఆర్‌పై, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సోయితప్పి మాట్లా డుతు న్నారన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తాం
ఇకపై తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వానికి అడిగే దమ్ములేక బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ధాన్యం కొనే వరకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో ఉద్యమాన్ని చేపడుతుందని హెచ్చరించారు. ఈ నెల 12న తెలం గాణలోని అన్ని నియోజకవర్గాల్లో కేంద్రప్రభుత్వ తీరుపై టీఆర్‌ ఎస్‌ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.  రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మరో ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపుని చ్చారు. టీఆర్‌ఎస్‌ శ్రేణుల సత్తా ఎంటో ఈ నెల 29న జరిగే వరంగల్‌ జయభేరి గర్జనలో చూపించాలన్నారు.
జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తాం : మంత్రి సబిత
రాష్ట్రంలో ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా గురుకుల పాఠ శాలలు పనిచేస్తున్నాయని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా రు. రిబ్బన్‌ కట్‌ చేసి పాఠశాల నూతన భవ నాన్ని ప్రారంభించిన మంత్రి బీబీపేట పాఠ శాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేస్తామని తెలిపారు. చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో సుభాష్‌ రెడ్డి బీబీపేట పాఠశాలను అత్యాధునిక హంగులతో నూతన భ వనాన్ని నిర్మించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా బీబీపేట పాఠశాల నిలిచిందన్నారు.
ప్రతిపక్షనేతలను అడ్డుకోవాలి : మంత్రి ప్రశాంత్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌పై, మంత్రి కేటీఆర్‌లపై బీజే పీ, కాంగ్రెస్‌ నేతలు ఇష్టారీతిన మాటాలడు న్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇకపై తమ నేతలపై ప్రతిపక్షాల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వాన్ని విమర్శించే ప్రతిపక్షాల నాయకులను టీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రామగ్రామాన అడ్డుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌తోనే కామారెడ్డి అభివృద్ధి : విప్‌ గంపగోవర్ధన్‌
కామారెడ్డి నియోజకవర్గం సీఎం కేసీఆర్‌ తోనే అభివృద్ధి చెందిదని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. నియోజక వర్గంలో అభివృ ద్ధిని చూసి ఓర్వ లేకే ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండి పడ్డారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని టీ ఆర్‌ఎస్‌ శ్రేణులు తిప్పికోట్టాలని అన్నారు.
కార్యక్రమాల్లో ఎంపీ బీబీపాటిల్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, అ దనపు కలెక్టర్లు వెంకటేష్‌దోత్రే, వెంకట మాధవరావు, జడ్పీ చైర్‌ పర్సన్‌ దపేదర్‌ శోభ, నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు, ఎమ్మె ల్యేలు హన్మంత్‌షిండే, నల్లమడుగు సురేందర్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌, గ్రంథాలయ చైర్మన్‌ పున్నరాజేశ్వర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌కుమార్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇంద్రా సేనారెడ్డి, కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి,వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందూప్రియ, మాజీ ఎమ్మెల్సీ ఆ కుల లలిత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతలు ముజీబొద్దీన్‌, నిట్టువేణుగోపా ల్‌ రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన విభాగ అధ్యక్షుడు భానుప్రసాద్‌, సర్పంచ్‌ లక్ష్మి, ఎంపీపీ బాలమణి, కౌన్సిలర్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST