సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-12-07T17:34:27+05:30 IST

వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.

సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతుల రాస్తారోకో

కామారెడ్డి: వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో సిరిసిల్ల - కామారెడ్డి రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. టోకెన్‌లు ఇచ్చి రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. 

Updated Date - 2021-12-07T17:34:27+05:30 IST