కామారెడ్డిలోని ఓ ఇంట్లో భారీ చోరీ

ABN , First Publish Date - 2021-10-19T14:48:05+05:30 IST

కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన వెంకట్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది.

కామారెడ్డిలోని ఓ ఇంట్లో భారీ చోరీ

కామారెడ్డి:  కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన వెంకట్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి 11 తులాల బంగారం, ఒక లక్షా ఎనభై వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. దసరా పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన రామారెడ్డి మండలం కన్నాపూర్‌కు వెంకటరెడ్డి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి దుండగులు ఇంటిలో నగదు, నగలు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-19T14:48:05+05:30 IST