కామారెడ్డిలో కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ బీజేవైఎం ఆందోళన

ABN , First Publish Date - 2021-11-09T18:14:35+05:30 IST

జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు.

కామారెడ్డిలో కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ బీజేవైఎం ఆందోళన

కామారెడ్డి: జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద బీజేవైఎం నాయకులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో కేటీఆర్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి వివిధ విద్యార్థి సంఘాల నాయకుల ఇళ్లకు వెళ్లి వెళ్లిన పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ వేణు, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విఠల్, టీజేఎస్ జిల్లా కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్, ఏబీవీపీ జిల్లా నాయకులు మనోజ్ ఉన్నారు. 

Updated Date - 2021-11-09T18:14:35+05:30 IST