1న జూనియర్ హాకీ ఎంపికలు
ABN , First Publish Date - 2021-10-30T05:14:25+05:30 IST
ఉమ్మడి జిల్లా జూనియర్ హాకీ పురుషుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విశాఖ గంగారెడ్డి, రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సుభాష్‌నగర్, అక్టోబరు 29: ఉమ్మడి జిల్లా జూనియర్ హాకీ పురుషుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విశాఖ గంగారెడ్డి, రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఎంపికలు నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో ప్రతిభకనబర్చిన క్రీడాకారులు నవంబరు 12,13,14 తేదీల్లో యాదిద్రి భువనగిరిలో జరగనున్న రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్‌కార్డు, జనన ఽద్రువీకరణపత్రం, ఎస్‌ఎస్‌సీ మెమో వెంట తెచ్చుకోవాలని ముఖ్యంగా హాకీ ఇండియా పోర్టల్‌లో రిజిస్ర్టేషన్ అయినటువంటి క్రీడాకారులు మాత్రమే అర్హులని తెలిపారు. క్రీడాకారులు జిల్లా కోశాధికారి సురేందర్, సంయుక్త కార్యదర్శి చిన్నయ్య, ఈసీ మెంబర్ నాగేశ్వర్ 9642535535, 9490148298 నంబర్‌లను సంప్రదించాలని కోరారు.