కాషాయ దళంలో జోష్
ABN , First Publish Date - 2021-02-26T04:57:14+05:30 IST
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం జరిగిన బీజే పీ బహిరంగ సభ ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో జోష్‌ను నింపింది. టీఆర్‌ఎస్‌కు కంచు కోటగా ఉన్న బాన్సు వాడలో బీజేపీ గురువారం జరిగిన బహిరంగ సభతో తన సత్తాను నిరూపించుకుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపిన బాన్సువాడ సభ
సభకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
స్పీకర్ పోచారం, ఆయన కుమారులపై ధ్వజమెత్తిన బండి సంజయ్, ఎంపీ అర్వింద్
గజదొంగలు, ఇసుక మాఫియా అంటూ ఘాటైన విమర్శలు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గురువారం జరిగిన బీజే పీ బహిరంగ సభ ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో జోష్‌ను నింపింది. టీఆర్‌ఎస్‌కు కంచు కోటగా ఉన్న బాన్సు వాడలో బీజేపీ గురువారం జరిగిన బహిరంగ సభతో తన సత్తాను నిరూపించుకుంది. సీఎం కేసీఆర్ నుంచి మొదలు కొని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుమారులు చే స్తున్న అవినీతి, అక్రమాలు, ఇసుక, ల్యాండ్ మాఫియాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ త మదైన శైలిలో ధ్వజమెత్తుతూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నిం పారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ ప్రజలకు పట్టిన గ్రహచారమని బండి సంజయ్ విమర్శించారు. పో చారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం వల్ల బాన్సువాడ అభివృద్ధికి దూరమైందన్నారు. ఇసుక, ల్యాండ్ మాఫియా రాజ్యమేలు తోందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కాషాయానికి అడ్డా అని, రేవూరి సురేందర్ స్ఫూర్తిగా కాషాయజెండాను ఎగుర వేస్తామన్నారు. వ్యవసాయానికి కేంద్రంగా కామారెడ్డి జిల్లా ఉందని, అలాంటి జిల్లా ఆయకట్టుకు నిజాంసాగర్ నీరు అందని పరిస్థితి ఉందన్నారు. కామారెడ్డి జిల్లా బెల్లంకు పెట్టిన పేరని, అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆంక్షలు ఎత్తివే స్తానని చెప్పి, ఇప్పటికీ హామీలు నెరవేర్చకుండా జిల్లా ప్రజ లను మోసం చేశాడన్నారు. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో టీఆర్‌ఎస్ బాక్సులు బద్దలవడం ఖాయమని, కాశాయ జెం డా ఎగురవేస్తామన్నారు. 30 ఏళ్లుగా బాన్సువాడను పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కొడుకులు గజ దొంగల్లా దోచుకు ంటున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కొడుకుల అవినీతి మితి మీరిపోయిందన్నారు. ఇసుక అక్రమ రవాణాతో భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అక్ర మ రవాణాలో కేసీఆర్ కుటుంబానికి కూడా వాటాలున్నా యని ఆరోపించారు. యంత్రలక్ష్మీ పథకం ద్వారా ఇచ్చే ట్రాక్ట ర్లు పోచారం కొడుకు షో రూంలో కొనకపోతే సర్పంచ్‌ల చె క్ పవర్ రద్దు చేసిన నీచ సంస్కృతి వారి దని మండిపడ్డారు. బాన్సువాడ వెనకబడి న ప్రాంతం కాదని, అభివృద్ధి నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతమ న్నారు. 2023లో బాన్సువాడ ప్రజలకు పోచారం గ్రహణం వీడనుందన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలో జరిగిన బ హిరంగ సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులతో పాటు హిందుత్వ సంఘాలు, అభి మానులు, ప్రజలు తరలివచ్చారు. సుమారు 8వేల పైచిలు కు బహిరంగ సభకు జనం హాజరయ్యారు. నిజామాబాద్ నుంచి బాన్సువాడ వరకు ఆ పార్టీ ముఖ్య నేతలు భారీ కా న్వాయ్, బైక్ ర్యాలీతో హల్‌చల్ చేశారు. వీరి కాన్వాయ్‌కి, ర్యాలీకి ఆయా గ్రామాల్లో ప్రజలు, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బాన్సువాడ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లాల బీజేపీ నేతలే కాకుండా రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర నాయకులు పల్లె గంగారెడ్డి, ఉభ య జిల్లాల అధ్యక్షులు బస్వా లక్ష్మీనర్స య్య, అరుణతార, నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, వెంకట రమణారెడ్డి, మురళీ ధర్ గౌడ్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, వినయ్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్, గీతామూర్తి, లోక భూపతిరెడ్డి, ఆలె భా స్కర్, రాకేష్ రెడ్డి, న్యాలం రాజు, బంటు రాము, అర్సపల్లి సాయిరెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్, చిదుర సాయిలు, రాజా సింగ్, రీతుసింగ్ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరికలు..
బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ముఖ్యంగా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత అయిన మాల్యాద్రి రెడ్డి అధికారికంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మాల్యాద్రి రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బాన్సువాడ మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల సు రేష్, మాజీ జడ్పీటీసీ కొత్తకొండ భాస్కర్, మాజీ ఏఎంసీ చైర్మన్ కొత్తకొండ నందిని, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు శంకర్ గౌడ్, బీర్కూర్ మాజీ ఎంపీపీ మల్లెల మీనా హన్మం తు, బాన్సువాడ మాజీ ఎంపీటీసీ డాకయ్య, మాజీ ఎంపీటీ సీ సాయికుమార్, మాజీ సర్పంచ్ రాజు దేశాయి, కొత్తపల్లి ఉప సర్పంచ్ సాయిలు, పోతంగల్ పండరి, నేమాని వీర్రా జు, రంజ్యా నాయక్, గోవర్ధన్, రాంసింగ్, నరేష్ రాథోడ్, శ్రీ కాంత్, మాజీ ఎంపీటీసీ హన్మాండ్లు, సాయిరెడ్డి, అనిల్ రెడ్డి, అభినయ్ రెడ్డిలతో పాటు తెలంగాణ ఉద్యమకారులు బీజేపీ లో చేరారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎ స్ పార్టీ ముఖ్యనేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు సర్పంచ్‌లు బీజేపీలో చేరి ఆ పార్టీకి గట్టి షాక్‌నే ఇచ్చారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న వారు సైతం పార్టీ మారడంతో బీజేపీకి మరింత బలం చేకూరిం ది. రానున్న రోజుల్లో కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు ముఖ్యులు చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నే తలు చెబుతున్నారు.