కామారెడ్డికి సాగు నీటిని అందించే బాధ్యత నాదే..

ABN , First Publish Date - 2021-07-09T05:05:15+05:30 IST

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలోని రైతాంగానికి సాగు నీరు అందించే బాధ్యత నాదేనని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

కామారెడ్డికి సాగు నీటిని అందించే బాధ్యత నాదే..
గజ్యానాయక్‌ తండాలో మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ప్యాకేజీ 22వ పనులు త్వరగా పూర్తి చేస్తాం
మంత్రి ప్రశాంత్‌రెడ్డి

మాచారెడ్డి, జూలై 8: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలోని రైతాంగానికి సాగు నీరు అందించే బాధ్యత నాదేనని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా జిల్లాలో చేపడుతున్న 22వ ప్యాకేజీ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిజా మాబాద్‌ జిల్లా మంచిప్ప వద్ద పనుల్లో జాప్యం జరిగిందన్నారు. త్వరలో నే ఈ పనుల్లో వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. మం డలంలో 13 గ్రామాలు 22వ ప్యాకేజీలో లేవని విప్‌ గంప గోవర్ధన్‌, ఎంపీపీ నర్సింగరావు మంత్రి దృష్టికి తేవడంతో మద్దిమల్ల ఎర్రవాగు చెరువు రాయన్‌ చెరువు నుంచి కాల్వ ద్వారా నీరు తీసుకురావడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో గజ్యానాయక్‌ తండాలో పల్లె ప్రగతి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రూ.10లక్షల నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ నిధులకు సంబంధించి జీవో విడుదల అయిందన్నారు.  రూ.32 కోట్ల 19లక్షల 44వేల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు చేశారు. పాల్వంచ మర్రి నుంచి జనగామ మర్రి వరకు డబుల్‌ రోడ్డు పనులను రూ.15 కోట్లతో 12 కి.మీ. రోడ్డు పనులు పూర్తి కావడంతో ప్రారంభించారు. చుక్కాపూర్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బ్రాహ్మన్‌పల్లి తండా వరకు లచ్చాపేట బీటీ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం గజ్యానాయక్‌ తండాలో రైతు వేదికలను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న డబ్బుల కంటే ప్రస్తుతం టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఏడు రేట్లు అదనంగా ఇస్తుందన్నారు.  అధికారం అంటే గుంజుకుంటే వచ్చేది కాదని, ప్రజలు ప్రేమతో ఇచ్చేదని ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట్రం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి..
ఫ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌
పల్లెలు బాగుండాలనే కోరికతో పల్లె ప్రగతి కార్యక్రమాలు సీఎం కేసీఆర్‌ ప్రారంభించారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి జరిగిందని అన్నారు. మండలంలో వేల కోట్లతో చేసే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి చేతు ల మీదుగా జరగడం చాలా సంతోషమన్నారు. అందరం సుఖ సంతోషా లతో ఉండాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామానికి రైతు వేదికలను నిర్మించినట్లు రైతులు పండించిన పంటను కొని వారంలో డబ్బులు అందించిన ఘనత సీఎందేనని పేర్కొన్నారు.
మంత్రి కాన్వాయ్‌ అడ్డగింత
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొనేందుకు వస్తున్నట్లు తెలుసుకు న్న ఏబీవీపీ నాయకులు గజ్యానాయక్‌ తండాలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు వారిని లాక్కెల్లి పోలీస్‌స్టేషన్‌ తీసుకె ళ్లారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే ముందస్తుగా బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని కామారెడ్డిలో ఉంచారు. అయినా ఏబీవీపీ నాయకులు మంత్రి గోబ్యాక్‌ అంటూ నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సింగరావు, జడ్పీటీసీ రాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T05:05:15+05:30 IST