మొక్కల పెంపకంలో ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2021-08-11T05:08:43+05:30 IST

జుక్కల్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న హరితహారం, పల్లె ప్రగతి పనుల్లో భాగంగా నాటిన మొక్కల పట్ల ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ గ్రామా ల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మరీ..

మొక్కల పెంపకంలో ఇంత నిర్లక్ష్యమా?
వృథాగా పడి ఉన్న మొక్కలు

ఇదేనా హరితహారం.. పల్లె ప్రగతి!?
జుక్కల్‌, ఆగస్టు 10: జుక్కల్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న హరితహారం, పల్లె ప్రగతి పనుల్లో భాగంగా నాటిన మొక్కల పట్ల ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ గ్రామా ల్లో నర్సరీలను ఏర్పాటు చేసి మరీ.. వేలాది మొక్కలు పెంచుతుండగా, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, మండలంలోని డోన్‌గాం, సోపూర్‌ తదితర గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎండిపోయి నిర్లక్ష్యంగా కనబ డుతున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో ఇదే పరిస్థితి. అదేవిధంగా, లక్షలాది రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయని, అశ్రద్ధ వహించిన వారిపై చర్యలు చేపట్టాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో నూతన మొక్కలు నాటాలని మండలం లోని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.  
నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవు
: రవీశ్వర్‌ గౌడ్‌, ఎంపీడీవో, జుక్కల్‌
మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవు. ఈ విషయమై గ్రామాల్లో తిరిగి పరిశీలిం చి, ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అంతేకాకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. అదేవిధంగా, పల్లెప్రగతి, హరితహారం పథకాలలో నాటిన మొక్కలతో పాటు పల్లె ప్రకృతి వనం, అవెన్యూప్లాంటేషన్‌ తదితర వాటిల్లో నాటిన మొక్కల సంరక్షణపై ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.

Updated Date - 2021-08-11T05:08:43+05:30 IST