ఇరిగేషన్ భూమి అన్యాక్రాంతం
ABN , First Publish Date - 2021-01-20T05:38:24+05:30 IST
నీటి పారుదల శాఖకు సంబంధించిన భూములను గుర్తిం చి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఆదేశాలు ఇస్తుంటే.. మరో వైపు కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యా క్రాంతం అవుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించు కోవడం లేదు.

కాల్వ భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
ఆర్మూర్, జనవరి 19: నీటి పారుదల శాఖకు సంబంధించిన భూములను గుర్తిం చి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఆదేశాలు ఇస్తుంటే.. మరో వైపు కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యా క్రాంతం అవుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించు కోవడం లేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ ప రిధిలో నిజాంసాగర్ కాలువ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జాచేసి విక్రయిస్తున్నారు. ఈ భూము ల్లో నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పెర్కిట్ శివారులో కరీంనగర్ రో డ్డుకు ఇరువైపులా నిజాంసాగర్ కాలువ భూమిని కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. ఇదివరకే కొన్ని కాంప్లెక్స్ ల నిర్మాణం పూర్తి అయ్యింది. గతంలో పంటలు పండిన సమయంలో నిజాంసాగర్ నీరు ఈ కాలువ ద్వా రా ప్రవహించేది. ప్రస్తుతం ఈ ప్రాంత ంలో వెంచర్‌లు వెలిసాయి. నీరు రానందు న రియల్ వ్యాపారులు కాలువ భూములు కబ్జా చేసి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. కరీంనగర్ మార్గంలో ఎడమ వైపు న గతంలో నిజాంసాగర్ కెనాల్ డిస్ర్టిబ్యూటరీ 82/2/1 ప్రవ హించేది. ఈ కెనాల్ భూమి ధర గజానికి రూ.50వేలు పలు కుతోంది. కరీంనగర్ రోడ్డు గతంలో జిల్లా పరిషత్ రోడ్డుగా ఉండేంది. నక్షాలో ఇప్పటికీ జడ్పీ రోడ్డుగానే ఉంది. అప్పట్లో ఇరువైపులా 33 అడుగుల రోడ్డు ఉండేంది. 30 ఏళ్ల క్రితం ఈ రోడ్డు జాతీయ రహదారిగా మారింది. నిజామబాద్ నుంచి జగదల్‌పూర్ వరకు జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సింగిల్ రోడ్డుగా ఉన్న దీనిని డబుల్ రోడ్డుగా మార్చారు. 33 అడుగుల నుంచి 50 అడుగులకు విస్తరించా రు. విస్తరణలో ఇరువైపులా ఉన్న ప్రైవేటు భూమి రోడ్డులో కలిసిపోయింది. దీనికి సంబంధించిన సర్వే నెంబర్‌తో ఇరిగేష న్ భూమిపై క్రయవిక్రయాలు జరుపుతున్నారు. పెర్కిట్ శివా రు నుంచి 44వ నెంబర్ జాతీయ రహదారి బ్రిడ్జి వరకు చు ట్టుపక్కల కెనాల్ భూమి ఉంది. విస్తరణలో పోయిన భూమి కి సంబంధించి సర్వే నెంబర్‌తో మున్సిపాలిటీలో అనుమతు లు తీసుకుంటున్నారు.
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు
కెనాల్ భూముల్లో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నప్ప టికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తి కాగా.. మరి కొన్ని ఇటీవల ప్రారంభమయ్యాయి. వీటి విషయమై కొంత మంది ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. నామమాత్రంగా జాయింట్ సర్వేకు రాసి చేతులు దులుపుకొన్నారు. ఇరిగేషన్ అధికారులు ఉదాసీనతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్ర భుత్వం ఇరిగేషన్ భూములు కాపాడాలని స్పష్టమైన ఆదేశా లు ఇచ్చినప్పటీకి స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
ఇరిగేషన్ భూమి ఆక్రమణ విషయమై ప్రజావాణిలో ఫి ర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. ఆర్మూర్‌కు చెంది న సడాక్ ప్రమోద్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు. గతంలో ఫి ర్యాదు చేస్తే స్పందన రాకపోవడంతో నెల రోజుల క్రితం మ ళ్లీ ఫిర్యాదు చేశాడు. గతంలో ఫిర్యాదు చేయగా ఫిబ్రవరి 27 న సర్వే చేస్తామని రెవెన్యూ అధికారులు అదే నెల 18న నోటీ సు జారీ చేశారు. సర్వేకు వచ్చిన ఇరిగేషన్ ఏఈ తనకు పట్ట ణ ప్రగతి ఉందని ఇప్పుడు సర్వే వద్దంటూ వెళ్లిపోయాడు. మళ్లీ మార్చి 11న సర్వే చేయాల్సి ఉండగా అధికారులు ఎవ రు రాలేదు. అప్పటి నుంచి మళ్లీ సర్వే తేది ఖరారు చేయలే దు. ప్రభుత్వ భూమి కాపాడటానికి అధికారులకు ఎం త చిత్తశుద్ధి ఉందో దీనిని బట్టి తెలుస్తోంది. పేదప్రజలు గుడిసెలు వేస్తే నా నా హంగామా చేసే అధికారులు ఆక్రమణదారులు పెద్ద కాంప్లెక్స్‌లు నిర్మి స్తున్నా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ అధికారు లు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. కాల్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలని కోరుతున్నారు.