అయోడిన్‌ లోపంతో రుగ్మతలు : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-10-22T05:19:07+05:30 IST

గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు ఎక్కువగా అయోడిన్‌ లోపంతో రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని డీఎంహెచ్‌వో బాల నరేంద్ర అన్నారు.

అయోడిన్‌ లోపంతో రుగ్మతలు : డీఎంహెచ్‌వో


పెద్దబజార్‌, అక్టోబరు 21: గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు ఎక్కువగా అయోడిన్‌ లోపంతో రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని డీఎంహెచ్‌వో బాల నరేంద్ర అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరూ అయోడిన్‌ ఉప్పును వాడాలని ప్రతీ మనిషికి రోజుకు 150 మైక్రో గ్రాముల అయోడిన్‌ అవసరమన్నారు. అయోడిన్‌లోపంతో గాయిటర్‌, హైపో థైరాయిడిజం, మానసిక అంగవైకల్యం, గర్భశ్రావాలు, మతృశిశు మరణాలు సంభవిస్తాయ్నరు. ఏఎన్‌ఎంలు, ఆశలు, అంగన్‌వాడీ సిబ్బంది వారి విధుల్లో భాగంగా గృహ సందర్శన చేసినపుడు ప్రతీ ఇంట్లో అయోడైజ్డ్‌ ఉప్పు వాడాలని అవగాహన కలిగించాలన్నారు. జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం మాట్లాడుతూ అయోడిన్‌ ఉప్పు వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం, చురుకుతనం, మంచి జ్ఞాపకశక్తి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అంజన, డాక్టర్‌ శివశంకర్‌, తుకారాం రాథోడ్‌, ఎన్‌సీడీ డాక్టర్‌ వెంకన్న, విద్యాశాఖ జిల్లా సైన్స్‌ అదికారి గంగాకిషన్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:19:07+05:30 IST