మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

జిల్లాలో 2021-23 ఎక్సైజ్‌ సంవత్సరానికి మద్యం దుకాణాల కేటా యింపు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ తెలి పారు.

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం



కామారెడ్డి,నవంబరు 9:
జిల్లాలో 2021-23 ఎక్సైజ్‌ సంవత్సరానికి మద్యం దుకాణాల కేటా యింపు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ తెలి పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వివరాలను వెల్లడించారు. 40 మద్యం దుకా ణాలకు గాను మరో 9 అదనంగా పెరిగినట్లు తె లిపారు. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణా లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్‌ పిరియడ్‌లో నోటిపై చేసిన మద్యం దు కాణాల ఎక్సైజ్‌ టాక్స్‌ స్లాబ్‌లు ఒక సంవత్సరా నికి 5 వేలలోపు జనభా ఉన్నవాటికి జిల్లాలో 7 దుకాణాలకు రూ.50 లక్షల చొప్పున, 50 వేలలో పు జనాభా ఉన్న 33 దుకాణాలకు రూ.55 లక్ష లు, 5 లక్షల జనాభాలోపు ఉన్న 9 దుకాణాలకు రూ.65 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపా రు. గతంలో రెండేళ్ల రిటైల్‌ షాపు ఎక్సైజ్‌టాక్స్‌ చెల్లింపు 8 విడతలు ఉండగా ఇప్పుడు ఏడాదికి 6 విడతల చొప్పున మొత్తం రెండేళ్లకు 12 విడు తల్లో చెల్లింపునకు అనుమతించినట్లు తెలిపారు. దరఖాస్తు దారుడు తన తరఫున ఒక రిప్రెజం టేటివ్‌ ద్వారా అప్లికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నా రు. ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి గల వారు దరఖాస్తుతో పాటు ‘ది డిస్టిక్ట్‌ ప్రొబి హేషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌ కామారెడ్డి’ పేరిట రూ.2లక్షల డీడీ తీయాలన్నారు. మూడు కలర్‌ పీపీ సైజ్‌ ఫొటోలు, సొంత ఽద్రువీకరణ, ఆధార్‌, పాన్‌కార్డు కాఫీలు అందించాలని తెలిపారు. 21 ఏళ్లలోపు ఉన్న వారు, ఎక్సైజ్‌ చట్టం 1968 కింద శిక్షపడ్డవారు, బకాయిదారు, కోర్టు ద్వారా దివా లా దారుగా ప్రకటించిన వారు కాకుండా ఎవరై నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక వ్య క్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. కొరియర్‌ పోస్టు, ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తులు అనుమతించమని, ముగింపు సమ యానికి దరఖాస్తులతో క్యూలో ఉన్న వారికే టో కెన్లు ఇస్తామని తెలిపారు. డ్రా జరిగే ప్రదేశం లోకి ఒరిజినల్‌ రిసిప్ట్‌, ఎంట్రి పాస్‌ ఉండాల న్నారు. దరఖాస్తు దారుల సమక్షంలో కలెక్టర్‌ లే దా అబ్కారి కమిషనర్‌ నియమించిన ఇతర అఽ దికారితో దుకాణాల కేటాయింపు డ్రా అలాట్‌ చే యనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు ఈనెల 9 నుంచి 18 వరకు (ఆదివారం మినహా) దరఖా స్తు చేసుకోవచ్చని తెలిపారు. సిరిసిల్లరోడ్డులో రేణుక కల్యాణ మండపంలో ఉదయం 11 గం టలకు డ్రా తీయనున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో ఎక్సైజ్‌ సీఐ ఫణింధర్‌రెడ్డి, ఎస్సై కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST