అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-11-06T05:15:46+05:30 IST
ఉమ్మడి జిల్లా పరిధిదిలోని మహాత్మజ్యోతి బాఫూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా రిజనల్ కోఆర్డినేటర్ స్వప్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్‌అర్బన్, నవంబరు 5: ఉమ్మడి జిల్లా పరిధిదిలోని మహాత్మజ్యోతి బాఫూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో బోధించేందుకు అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా రిజనల్ కోఆర్డినేటర్ స్వప్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్ర్తాలను ఆంగ్లంలో బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులలో పోస్టుగ్రాడ్యూయేషన్, బీఈడీ కలిగిన అర్హులైన అభ్యర్థులు సమీపంలోని జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో బయోడేటా, సంబందిత సర్టిఫికెట్ల జిరాక్స్‌లు ఈ నెల 9లోగా అందజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.