ఆర్టీసీలో అద్దె బస్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-12-08T05:05:48+05:30 IST

నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని పలు డిపోలలో హైర్‌ స్కీం కింద ప్రైవేట్‌ అద్దె బస్సులు నడపడంకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం సుధా పరిమళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీలో అద్దె బస్సుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

సుభాష్‌నగర్‌, డిసెంబరు 7: నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలోని పలు డిపోలలో హైర్‌ స్కీం కింద ప్రైవేట్‌ అద్దె బస్సులు నడపడంకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌ఎం సుధా పరిమళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ.2500 రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లించాలని, ఈ డబ్బులు తిరిగి ఇవ్వబడవని తెలిపారు. క్యాష్‌ అండ్‌ డిపాజిట్‌ కోసం రూ.60వేలు చెల్లించాలని తెలిపారు. రిజిస్ర్టేషన్‌ క్యాష్‌ అండ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ పేరుమీద రెండు డిమాండ్‌డ్రాఫ్ట్‌లు విడిగా చెల్లించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అద్దె పథకం కింద బస్సులు సరఫరా చేయడానికి 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వ్యక్తులు దరఖాస్తులు చేయడానికి అనర్హులని తెలిపారు. ఎటువంటి కారణం లేకుండా ఈ టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దుచేసే హక్కు సంస్థకు ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


Updated Date - 2021-12-08T05:05:48+05:30 IST