ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2021-02-27T04:47:19+05:30 IST

మార్చి 4న ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలపై దరఖాస్తు దారులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రవీశ్వర్‌గౌడ్‌ తెలిపా రు.

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూలు

జుక్కల్‌, ఫిబ్రవరి 26: మార్చి 4న ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలపై దరఖాస్తు దారులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రవీశ్వర్‌గౌడ్‌ తెలిపా రు. ఉదయం 11 గంటలకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

బీబీపేట: మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఎంపీడీవో నారాయణ తెలిపారు. 85మంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, మండలం మొత్తానికి తొమ్మిది యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-02-27T04:47:19+05:30 IST