ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-10-21T04:57:06+05:30 IST

జిల్లాలో వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. ప్రతీరోజు జరిగే వ్యాక్సినేషన్‌పై కలెక్టర్‌ దృష్టి సారించడంతో పాటు ఎప్ప టికప్పుడు వైద్య సిబ్బందికి 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తి కావాలని ఆదేశాలు ఇవ్వ డంతో ఇంటింటిని జల్లెడ పడుతున్నారు.

ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్‌
నస్రుల్లాబాద్‌లో ఇంటింటా తిరుగుతూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేస్తున్న దృశ్యం

 కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 20: జిల్లాలో వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. ప్రతీరోజు జరిగే వ్యాక్సినేషన్‌పై కలెక్టర్‌ దృష్టి సారించడంతో పాటు ఎప్ప టికప్పుడు వైద్య సిబ్బందికి 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తి కావాలని ఆదేశాలు ఇవ్వ డంతో ఇంటింటిని జల్లెడ పడుతున్నారు. ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ అందేలా చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 45,46,47వ వార్డుల్లో కౌన్సిలర్‌లు పిట్లవేణు, కోయిలకర్‌ కన్నయ్య, గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణలు ప్రతీ ఇంటికి వైద్య సిబ్బందిని తీసుకెళ్లి టీకాలు అందేలా చూస్తున్నారు. కామారెడ్డి రాజీవ్‌నగర్‌పీహెచ్‌సీ, దేవునిపల్లి పీహెచ్‌సీ పరిధిలో మెడికల్‌ ఆఫీసర్‌లు సుజాయత్‌అలీ, సుస్మిత, మౌనికలు ముమ్మరంగా టీకా కార్యక్రమం కొనసాగిస్తూ వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో 4 కరోనా కేసుల నమోదు
జిల్లాలో బుధవారం 4 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 153 మందికి పరీక్షలు నిర్వహించగా కామారెడ్డిలో 4 గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం.
ఇంటింటా వ్యాక్సినేషన్‌
నస్రుల్లాబాద్‌ : మండలంలో ఇంటింటా తిరుగుతూ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వేస్తు న్నామని వైద్యులు రాజా రమేష్‌ అన్నారు. బుధవారం నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో ఇంటింటా తిరుగుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోని వారికి టీకాలు వేశా మన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ప్రతీ గ్రామ ంలో నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులున్నారు.

Updated Date - 2021-10-21T04:57:06+05:30 IST