రంగనాథ స్వామి ఆలయ భూముల పరిశీలన

ABN , First Publish Date - 2021-11-09T05:58:43+05:30 IST

పట్టణకేంద్రంలోని రంగనాథ స్వామి ఆలయ భూములను సోమవారం ఆలయ ట్రస్టు ఈవో అంజయ్య పరిశీలించారు. షే ర్‌లింగంపల్లి డివిజన్‌లోని నానక్‌ రాంగూడ శ్రీ రంగనాథ గుడి దేవాదాయ శాఖ భూముల స్వాధీనానికి ఎండోమెంట్‌ అధికారులు రావడంతో అక్రమ ని ర్మాణంలో ఉన్న యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఏవో అంజయ్య మాట్లాడుతూ 1953-54లో పన్నాలాల్‌ పిట్టి రంగనాథస్వామి దేవస్థానానికి దానం చేసినట్లు తెలిపారు. 1984లో దేవాదాయ శాఖకు తెలి యకుండా కొంతమంది ఓఆర్‌సీ చేసుకున్నారన్నారు.

రంగనాథ స్వామి ఆలయ భూముల పరిశీలన

ఎల్లారెడ్డి, నవంబరు 8: పట్టణకేంద్రంలోని రంగనాథ స్వామి ఆలయ భూములను సోమవారం ఆలయ ట్రస్టు ఈవో అంజయ్య పరిశీలించారు. షే ర్‌లింగంపల్లి డివిజన్‌లోని నానక్‌ రాంగూడ శ్రీ రంగనాథ గుడి దేవాదాయ శాఖ భూముల స్వాధీనానికి ఎండోమెంట్‌ అధికారులు రావడంతో అక్రమ ని ర్మాణంలో ఉన్న యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఏవో అంజయ్య మాట్లాడుతూ 1953-54లో పన్నాలాల్‌ పిట్టి రంగనాథస్వామి దేవస్థానానికి దానం చేసినట్లు తెలిపారు. 1984లో దేవాదాయ శాఖకు తెలి యకుండా కొంతమంది ఓఆర్‌సీ చేసుకున్నారన్నారు. 2019లో డిసెంబరులో పరిశీలించగా ఈ భూముల వ్యవహారం బయటపడిందని తెలిపారు. గతం లోనే సబ్‌ రిజిస్ర్టార్‌ అధికారులతో ఈ భూముల విషయం చర్చించినా రిజి స్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. 19 ఎకరాల 21 గుంటలకు సంబంధిం చిన భూ సర్వే నెంబర్లు 42 నుంచి 45 తర్వాత 51, 583, 584, 586 నుంచి 589, 591, 592, 595 నుంచి 598, 600 నుంచి 602 సర్వే నెంబర్లు గల భూ మి రంగనాథ ఆలయానికి చెందినట్లు చెప్పారు. భూమిలో ఎవరూ ఇళ్లు చే పట్టకుండా నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు.


Updated Date - 2021-11-09T05:58:43+05:30 IST