సహకార శాఖలో విజిలెన్స్ అధికారి తనిఖీ
ABN , First Publish Date - 2021-04-10T05:43:55+05:30 IST
గత సహకార ఎన్నికల్లో చేసిన ఖర్చుపై ఆ డిట్ అభ్యంతరాల నేపథ్యంలో ఆ శాఖ విజిలెన్స్ అధికారి శుక్రవారం నిజామాబాద్‌కు వచ్చారు.
నిజామాబాద్ అర్బన్, ఏప్రిల్ 9: గత సహకార ఎన్నికల్లో చేసిన ఖర్చుపై ఆ డిట్ అభ్యంతరాల నేపథ్యంలో ఆ శాఖ విజిలెన్స్ అధికారి శుక్రవారం నిజామాబాద్‌కు వచ్చారు. సంఘాల వారీగా చేసిన ఖర్చుల వివరాలను సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు రావడంతో తనిఖీ చేశామని, నివేదినకు ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.