రోడ్డు ప్రమాదంలో సర్పంచ్‌కు గాయాలు
ABN , First Publish Date - 2021-06-21T06:51:30+05:30 IST
మండలంలోని ఘన్పూర్(ఎం) స్టేజీ వద్ద ఆదివా రం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ హెమ్లనాయక్, వార్డు సభ్యుడు ఎల్లగౌడ్, నరేష్‌లకు తీవ్రగాయాలైనట్లు ఏఎస్సై లాయక్ అలీ తెలిపారు.
మాచారెడ్డి, జూన్ 20: మండలంలోని ఘన్పూర్(ఎం) స్టేజీ వద్ద ఆదివా రం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ హెమ్లనాయక్, వార్డు సభ్యుడు ఎల్లగౌడ్, నరేష్‌లకు తీవ్రగాయాలైనట్లు ఏఎస్సై లాయక్ అలీ తెలిపారు. రోడ్డుపక్కన ఆగి ఉన్న కారును ఆపి ఉండగా వెనుక నుంచి మ రో కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయని తెలిపారు. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసు కొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై తెలిపారు.