ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-10-26T04:52:26+05:30 IST
జిల్లాలో సోమ వారం ఇంటర్మీడి యెట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్ పరీక్ష నిర్వహించారు.

తొలిరోజు హాజరైన 9198 మంది విద్యార్థులు
833 మంది గైర్హాజరు
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి షేక్ సలాం
కామారెడ్డిటౌన్, అక్టోబరు 25: జిల్లాలో సోమ వారం ఇంటర్మీడి యెట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీ క్షకు మొత్తం 10,031 మంది హాజరు కావాల్సి ఉండగా 833 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ సబ్జెట్‌లకు 8890 మంది హాజరుకావలసి ఉండగా 8210 మంది విద్యార్థులు హాజరు కాగా 680 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ సబ్జెట్‌లకు 1141 మంది హాజ రుకావాల్సి ఉండగా 988 మంది విద్యార్థులు మా త్రమే హాజరు కాగా 153 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా నాలుగుచోట్ల సమయం మించిపోయిన తర్వాత విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోగా వారిని పరీక్షకు అనుమతించలేదని నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీఆర్యభట్ట, ఎస్‌ఆర్ కళాశాలలను ఆయన పరిశీలించారు.