దేశీదారు మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-05-21T04:55:49+05:30 IST
మండలంలోని డోంగ్లీ గ్రామ శివారులో దెగ్లూర్ నుం చి అక్రమంగా బిచ్కుందకు తీసుకెళుతున్న దేశీదారు మద్యం సీసాలను ఎక్సై జ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

మద్నూర్, మే 20: మండలంలోని డోంగ్లీ గ్రామ శివారులో దెగ్లూర్ నుం చి అక్రమంగా బిచ్కుందకు తీసుకెళుతున్న దేశీదారు మద్యం సీసాలను ఎక్సై జ్ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ సీఐ సుధాకర్ వివ రాల మేరకు మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ దెగ్లూర్ నుంచి అక్రమంగా దేశీదారు మద్యంను 96 సీసాల్లో తీసుకెళుతుండగా, డోం గ్లీ వద్ద పట్టుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని సీఐ వివరించారు.