గంగపుత్రులు, ముదిరాజ్‌ల కోసంపలు సంక్షేమ పథకాల అమలు

ABN , First Publish Date - 2021-09-02T06:38:06+05:30 IST

ప్రభుత్వం గంగపుత్ర, ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తుందని రాష్ట్ర మత్య్సశాఖ అదనపు డైరెక్టర్‌ శంకర్‌రాథోడ్‌ అన్నారు. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన మత్య్స సమన్వయ

గంగపుత్రులు, ముదిరాజ్‌ల కోసంపలు సంక్షేమ పథకాల అమలు
సమావేశంలో పాల్గొన్న గంగపుత్రులు, ముదిరాజ్‌లు

త్య్సశాఖ అదనపు డైరెక్టర్‌ శంకర్‌ రాథోడ్‌ 

రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సమన్వయ కమిటీ సమావేశం

నిజామాబాద్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/నిజామాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వం గంగపుత్ర, ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాల ను అమలు చేస్తుందని రాష్ట్ర మత్య్సశాఖ అదనపు డైరెక్టర్‌ శంకర్‌రాథోడ్‌ అన్నారు. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన మత్య్స సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగపుత్రులు, ముదిరాజ్‌ల కోసం సబ్సిడీపైన పరికరాలను అందించడంతో పాటు వాహనాలను అందజేస్తున్నామన్నారు. మత్య్సకారుల అభి వృద్ధి కోసం ప్రభుత్వం ప్రతీయేడాది చేప పిల్లల పంపిణీ చేపడుతోందన్నారు. జిల్లాలో నూతన సొసైటీలా ఏర్పాటు కూడా దరఖాస్తులను స్వీకరించి పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే దరఖాస్తులపైన విచారణ పూర్తిచేశామన్నారు. జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను నివేదికక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. జిల్లాలో ముదిరాజ్‌, గంగపుత్ర, బేస్తా సంఘాల కోసం 167 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో ముదిరాజ్‌కు సంబందించినవే 107 ఉన్నాయని తెలిపారు. అన్నింటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అదనపు డైరెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జిల్లా సబ్‌ కమిటీని ఎంపిక చేశామని తెలి పారు. ఈ కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారన్నారు. ఈ సమావేశంలో జిల్లా మత్య్సశాఖ అధికారి ఆంజనేయస్వామి, ఎఫ్‌డీవో లు మోయినోద్దిన్‌, నగేష్‌, సమన్వయ కమిటీ సభ్యులు బలరంగం,  శ్రీని వాస్‌, నారాయణ, సత్తయ్య,  శ్రీనివాస్‌, మల్లయ్య, యా దగిరి, ధన్‌రాజ్‌, సత్యనారా యణ,  శం కర్‌లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-09-02T06:38:06+05:30 IST