ధాన్యం రైతుల్లో ఆశలు

ABN , First Publish Date - 2021-02-27T04:51:07+05:30 IST

ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుం డడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటి ంచారు.

ధాన్యం రైతుల్లో ఆశలు

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం? 

వ్యవసాయాధికారుల నుంచి వివరాల సేకరణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 26: ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుం డడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో ముఖ్య మంత్రి కేసీఆర్‌ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటి ంచారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా వ్యవసాయాధికారుల నుంచి ప్రబుత్వం వివరాలు సేకరించ డంతో కొనుగోలు చేయవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్ర భుత్వం ధాన్యం కొనుగోలు చేసే అవకాశముందని, సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి వ్యవసాయాధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ఇప్పటి వరకు అ యోమయంగా ఉన్న రైతులు ప్రస్తుతం ఊరట చెందుతు న్నారు. నిజామాబాద్‌ జిల్లాలో యాసంగిలో రైతులు సుమా రు 3.75లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. సుమా రు ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవ కాశముంది. గత యాసంగిలో జిల్లాలో 5.25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవడం, జలాశయాలు నిండడం, భూగర్భజలాలు పెరగ డం తదితర కారణాల వల్ల వరి విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో అన్ని పంటల కంటే వరి పంటను ఎక్కువగా సాగు చేస్తు న్నారు. జిల్లాలో ప్రధాన పంట వరి కావడం గమనార్హం. కొ న్నేళ్లుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర లభిస్తోంది. ప్రైవేటు వ్యాపారు లు, గంజ్‌లలో సరైన ధర కాదు, మద్దతు ధర కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం ఐకేపీ, సొసైటీలను  రంగంలోకి దించడంతో రూ.1,888 మద్దతు ధర లభించింది. డబ్బులు కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అయ్యేవి. కడ్తా వంటి చిన్న చిన్న సమస్యలు మినహా సాఫీగా కొనుగో ళ్లు జరిగాయి. ముఖ్యమంత్రి ప్రకటన మేరకు కొనుగోళ్లు బంద్‌ చేస్తే రైతులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. వ్యా పారుల దోపిడీ ఎక్కువవుతోంది. మద్దతు ధర కంటే నాలుగై దు వందలు తక్కువ ధరకు విక్రయించుకోవలసి ఉంటుం ది. వానాకాలంలో ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయలే దు. మక్క పంటను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిం ది. మక్కలను ఎవరు సాగు చేయవద్దని సూచించింది. మ క్కలను నిషేధిస్తున్నట్టు ప్రకటించినందున కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు మద్దతు ధర కం టే ఐదారు వందలు తక్కువకు వ్యాపారులకు విక్రయించా రు. రైతుల అవకాశాన్ని అసరాగా తీసుకుని వ్యాపారులు ధ ర తగ్గించారు. చివర్లో ప్రభుత్వం కొనుగోలు చేసినా అప్పటికే రైతులు మక్కలను వ్యాపారులకు విక్రయించారు. ధాన్యం పరిస్థితి కూడా అలాగే అవుతుందని రైతులు ఆందోళన చెం దుతున్నారు. నెల రోజుల్లో ధాన్యం చేతికి రావడం ప్రారంభ మవుతుంది. జిల్లాలోని వర్ని, బోధన్‌ ప్రాంతాల్లో ముందుగా నే నాట్లు వేస్తారు. ఆ ప్రాంతంలో ముందుగా ధాన్యం చేతికి వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకపో వడంతో ఆందోళన చెందారు. 

ముందుగా ఆదేశాలు వస్తేనే మేలు.. 

 ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిర్ణయం తీసుకుంటే ఇప్ప టి నుంచే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, ఐకేపీ శాఖల సమన్వయంతో కొను గోలు చేయాల్సి ఉన్నందున, ఈ శాఖలను అప్రమత్తం చే యాలి. గన్నీ బ్యాగులు సిద్ధం చేసుకోవాలి. ట్రాన్స్‌ఫోర్టు ఏజె న్సీని నియమించాలి. కాంటాలు, హమాలీలు ఏర్పాటు చేసు కోవాలి. ప్రభుత్వం ముందుగా నిర్ణయం ప్రకటిస్తే ఇవన్నీ స మకూర్చుకోడానికి వీలుంటుంది. ఉన్న ఫలంగా నిర్ణయం ప్రకటిస్తే ఏర్పాటు చేసుకోవడానికి అధికారులకు ఇబ్బంద వుతుంది.

Updated Date - 2021-02-27T04:51:07+05:30 IST