యానంపల్లి శివారులో భారీగా కోళ్లు మృతి

ABN , First Publish Date - 2021-01-14T04:51:08+05:30 IST

డిచ్‌పల్లి మండలం యానంపల్లి గిరిజన తండాలో దుర్గాభవాని పౌలి్ట్రఫాంలో ఇప్పటి వరకు సుమారు 1700కు పైగా కోళ్లు మృతిచెందాయి.

యానంపల్లి శివారులో భారీగా కోళ్లు మృతి
కోడి రక్తపు శాంపిళ్లను సేకరిస్తున్న అఽధికారులు

డిచ్‌పల్లి, జనవరి 13: డిచ్‌పల్లి మండలం యానంపల్లి గిరిజన తండాలో దుర్గాభవాని పౌలి్ట్రఫాంలో ఇప్పటి వరకు సుమారు 1700కు పైగా కోళ్లు మృతిచెందాయి. బుధవారం  సైతం 500పైగా కోళ్లు మృతి చెందాయి. నిజామాబాద్‌ జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ భరత్‌, ఏడీ దేశ్‌పాండే పశువైద్యాధికారి డాక్టర్‌ గోపకృష్ణ పౌలి్ట్రఫాంకు చేరుకొని నిర్వాహకులు రాంచందర్‌గౌడ్‌తో మృతిచెందిన కోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బతికున్న కోళ్ల రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు తరలించారు. ఈ విషయంలో జేడీ డాక్టర్‌ భరత్‌ మాట్లాడుతూ కోళ్లు చనిపోయిన విషయాన్ని పరిశీలిస్తే బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. ల్యాబ్‌ పరిశీలన వివరాలు వచ్చేవరకు తాము ఎలాంటి వివరాలు చెప్పలేమని తెలిపారు. తండాను సందర్శించిన ఉన్నతాధికారులు తండాను సందర్శించి బర్డ్‌ఫ్లూ విషయంలో ఎలాంటి ఆందోళన చెందన వద్దని మనోధైర్యంతో ఉండాలన్నారు.

Updated Date - 2021-01-14T04:51:08+05:30 IST