దున్నపోతుకు వినతిపత్రం అందజేత

ABN , First Publish Date - 2021-12-03T05:17:51+05:30 IST

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే, ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఏబీవీపీ నాయకులు అన్నారు.

దున్నపోతుకు వినతిపత్రం అందజేత

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 2: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే, ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఏబీవీపీ నాయకులు అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలో దున్నపోతుకు వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు.  ప్రభుత్వానికి ఎన్నిరకాలుగా విన్నవించినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగానే వ్యవహరిస్తోందని, ఈ తరహలో నిరసన వ్యక్తం చేసినట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ భానుప్రసాద్‌ తెలిపారు. యూపీఎస్‌సీ మాదిరిగా టీఎస్‌పీఎస్‌సీ జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో హస్టల్స్‌ విభాగం కన్వీనర్‌ పోతురాజ్‌ లక్ష్మణ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంజయ్‌, ఖలీల్‌, గోపికృష్ణ, కార్యకర్తలు సిద్దు, సమీర్‌, శివ, మదు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:17:51+05:30 IST