భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ABN , First Publish Date - 2021-07-25T04:30:48+05:30 IST

జిల్లాకేంద్రంలోని గంగాస్థాన్‌-2 రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు సాయిప్రసాద్‌ భగవాన్‌ రామకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సాయన్న, గంగాధర్‌, ప్రకాశ్‌, బుచ్చన్న పాల్గొన్నారు. న్యాల్‌కల్‌ రోడ్డలోని శబరి ఆశ్రమంలో పురోహితులు శ్రీధర్‌ శబరి మాతకు అభిషేకం చేశారు. లలితాదేవి ఆ శ్రమంలో అమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
మాధవనగర్‌ సాయిబాబా ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

నిజామాబాద్‌కల్చరల్‌, జూలైౖ 24: జిల్లాకేంద్రంలోని గంగాస్థాన్‌-2 రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు సాయిప్రసాద్‌ భగవాన్‌ రామకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సాయన్న, గంగాధర్‌, ప్రకాశ్‌, బుచ్చన్న పాల్గొన్నారు. న్యాల్‌కల్‌ రోడ్డలోని శబరి ఆశ్రమంలో పురోహితులు శ్రీధర్‌ శబరి మాతకు అభిషేకం చేశారు. లలితాదేవి ఆ శ్రమంలో అమ్మవారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. మాధవనగర్‌ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రవీందర్‌గుప్త, తదితరులు పాల్గొన్నారు. ముదక్‌పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూల విగ్రహానికి పంచామృతాభిషేకాలు జరిపారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహమూర్తి పాల్గొన్నారు. నగరంలోని శివాజీనగర్‌లో గల రామకృష్ణ విద్యానికేతన్‌లో కథామృతాన్ని పఠించారు. ఎస్‌ఎన్‌.చారి, సముద్రాల శ్రీనివాసచారి, మధుసూదనచారి, శశిరేఖ, భాగ్య పాల్గొన్నారు. గాంధీనగర్‌లోని లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో పీఠాధిపతి పిట్లకృష్ణ మహరాజ్‌ పూజలు చేశారు.
ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై..
పెర్కిట్‌: ఆర్మూర్‌ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై శనివారం రామాలయం, దత్తాత్రే య, అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భారత్‌గ్యాస్‌ సుమన్‌, తిరుమల దంపతులు సత్యనారాయణ వ్రతం చేసి నందీశ్వర మహరా జ్‌కు పట్టువస్త్రాలు సమర్పించారు. అన్నదాన ప్రసారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ క మిటీ చైర్మన్‌ ఏనుగు శేఖర్‌రెడ్డి పీసీ.గంగారెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ ఆ ర్మూర్‌ ఆధ్వర్యంలో గురువులను సన్మానం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు పుప్పాల శి వరాజ్‌, చెన్నరవి, మోహన్‌దాస్‌, విజ్జు సంతోష్‌, గ్యాని, తిరుపతి, ద్యాగ ఉదయ్‌ పాల్గొన్నారు.
శ్రీలలితాంబ దేవి ఆశ్రమంలో..
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి గ్రామ శివారులోని శ్రీలతాంబదేవి ఆశ్రమంలో శనివారం పీఠాధిపతి  రామానంద స్వామి ఆధ్వర్యంలో యజ్ఞం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పాదపూజలు చేశా రు. కార్యక్రమంలో ఆలయ యువసేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
మోక్షనంద ఆశ్రమంలో..
భీమ్‌గల్‌: పట్టణ శివారులోని మోక్షనంద ఆశ్రమం, దత్తాత్రేయ ఆశ్రమంలో గురుపౌర్ణమి మహోత్సవ నిర్వహించారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.
తొర్లికొండలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో..  
జక్రాన్‌పల్లి: తొర్లికొండలోని వేంకటేశ్వరస్వామి ఆయలంలో సీతారామశాస్త్రి ప్రవచనాలు చే శారు. కలిగోట్‌లోని పుట్ట శివాలయంలో భక్తులు పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.
ధర్మారం శివాలయంలో..
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం శివాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయ ప్రతినిధి రావుల బ్రహ్మనందం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:30:48+05:30 IST